ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటన..
మే 31, 2022 నాటికి రెండు ఏజెన్సీలు కలిపి 1,49,733 ఉపాధి ఆధారిత వలస వీసాలను జారీ చేశాయి.ఈ క్రమంలో ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అందుబాటులో ఉన్న అన్ని వీసాల వినియోగాన్ని గరిష్ఠంగా ఉపయోగించేందుకు తాము ప్రతి ఆచరణీయ విధానాన్ని అవలంభిస్తామని ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఒక ప్రకటనలో తెలిపింది. 2021 ఆర్థిక సంవత్సరంలో 66,781 ఉపయోగించని ఉపాధి ఆధారిత గ్రీన్ కార్డ్‌లు US ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. వీటిని పొందేందుకు సుమారు 14 లక్షల మంది దరఖాస్తుదారులు క్యూ కట్టారు.

ఎన్ని గ్రీన్ కార్డ్‌లు జరీ అయ్యాయంటే..
USCIS చివరికి గత సంవత్సరం 1,80,000 గ్రీన్ కార్డ్‌లను జారీ చేసింది-సాధారణ సంవత్సరం కంటే ఎక్కువ. కానీ.. ఇప్పటికీ అందుబాటులో ఉన్న మొత్తం కంటే ఈ సంఖ్య తక్కువని చెప్పుకోవాలి. యజమాని అంటే ఉద్యోగి పనిచేస్తున్న కంపెనీలు స్పాన్సర్ చేసే గ్రీన్ కార్డులకు 2022లో దరఖాస్తుదారుల వెయిటింగ్ పిరియడ్ మూడు సంవత్సరాలను దాటింది. 2,500 డాలర్లను రుసుముగా చెల్లించటం వల్ల ఈ వెయిటింగ్ పిరియడ్ కనీసం ఏడు నెలల వరకు తగ్గించవచ్చు. 2016 నుంచి గ్రీన్ కార్డు జారీకి సగటున 16 నెలల సమయం పట్టింది.

పనిచేస్తున్న కంపెనీ ద్వారా వీసా ఇలా..
మీరు పనిచేస్తున్న కంపెనీ ద్వారా వీసా పొందాలంటే దానికి ఆరు దశల ప్రక్రియ ఉంటుంది. దీని కోసం కంపెనీతో పాటు ఉద్యోగి కూడా తగిన పత్రాలను అందిచాల్సి ఉంటుంది. దీని తర్వాత కార్మిక శాఖ ప్రస్తుత వేతనాలు, నైపుణ్య స్థాయి, ఏరియా కోడ్‌ను పరిశీలిస్తుంది.