ప్రమాదపు అంచున ఉన్న దేశాలు..

క్షీణిస్తున్న కరెన్సీలు విలువ, పాతాళానికి చేరుకుంటున్న ఫారెక్స్ నిల్వల పరంగా ఈ డేటా రూపొందించటం జరిగింది. శ్రీలంక, లెబనాన్, రష్యా, సురినామ్, జాంబియా అప్పుల కష్టాల్లో చిక్కుకున్నాయి. బెలారస్ సహా మరికొన్ని దేశాలు ప్రమాదం అంచున ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి.

అర్జెంటీనా:

అర్జెంటీనా:

పెసో ఇప్పుడు బ్లాక్ మార్కెట్‌లో దాదాపు 50% తగ్గింపుతో ట్రేడవుతోంది. నిల్వలు చాలా తక్కువగా ఉన్నాయి. డాలర్‌లో బాండ్‌లు కేవలం 20 సెంట్ల వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఆర్థిక వ్యవస్థలో2024 వరకు ప్రభుత్వానికి ఎలాంటి రుణం లేదు. అయితే ఆ తర్వాత అప్పులు పెరుగుతాయని భావిస్తున్నారు.

ఉక్రెయిన్:

ఉక్రెయిన్:

రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం మధ్య ఉక్రెయిన్ దాని 20 బిలియన్ డాలర్ల రుణాన్ని పునర్నిర్మించవలసి వస్తుంది. మోర్గాన్ స్టాన్లీ, అముండి వంటి పరిశోధనా సంస్థలు ఇప్పటికే హెచ్చరించాయి. సెప్టెంబరులో 1.2 బిలియన్ డాలర్ల లోన్స్ చెల్లించాల్సి ఉంది. కానీ ఇప్పుడు సహాయం కోసం ఉక్రెయిన్ పొరుగు దేశాల వైపు చూస్తోంది.

ట్యునీషియా:

ట్యునీషియా:

ట్యునీషియా ఇప్పటికే అత్యంత ప్రమాదకరంగా ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో ఒకటి. దాదాపు 10% బడ్జెట్ లోటు ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ రంగ వేతన ప్రమాణాల్లో ఒకటి. ట్యునీషియాలో పరిస్థితి మధ్య, అది మళ్లీ రుణం తీసుకోవలసి వస్తుంది. ఉక్రెయిన్, ఎల్ సాల్వడార్, ట్యునీషియాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి.

ఘనా:

ఘనా:

ఘనా రుణ నిష్పత్తి దాని GDPలో దాదాపు 85 శాతానికి పెరిగింది. దీని కరెన్సీ విలువ కూడా భారీగా క్షీణించింది. ఇప్పటికే పన్ను ఆదాయంలో సగానికి పైగా రుణ చెల్లింపులకోసం ఈ దేశం వెచ్చిస్తోంది. ద్రవ్యోల్బణం కూడా ఇప్పుడు 30 శాతానికి చేరువైంది.

ఈజిప్ట్:

ఈజిప్ట్:

ఈజిప్టు దాని GDPలో దాదాపు 95 శాతం అప్పులో ఉంది. ఈ ఏడాది సవాళ్లతో కూడిన పరిస్థితుల మధ్య విదేశీ పెట్టుబడులు ఎక్కువగా వచ్చాయి. JP మోర్గాన్ డేటా ప్రకారం.. సుమారు 11 బిలియన్ డాలర్లు బయటపడ్డాయి. అదనంగా.. ఆర్థిక సంస్థ FIM పార్టనర్స్ ప్రకారం ఈజిప్ట్ రాబోయే ఐదు సంవత్సరాల్లో 100 బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించాల్సి ఉంది. దీని కరెన్సీ విలువ దారుణ పరిస్థితుల్లో ఉంది.

కెన్యా:

కెన్యా:

కెన్యా తన ఆదాయంలో దాదాపు 30% అప్పుపై వడ్డీగా చెల్లిస్తుందని తెలుస్తోంది. దాదాపు సగం ప్రభుత్వ బాండ్లు వాటి విలువను కోల్పోయాయి. 2024లో 2 బిలియన్ డాలర్ల బాండ్ చెల్లింపులు ఉన్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఈ దేశంలో అప్పుల భారం ప్రధాన సమస్యగా ఉంది. మరోపక్క అంతర్యుద్ధం వల్ల ఇథియోపియా వృద్ధి రేటు దెబ్బతింటోంది.

ఎల్ సాల్వెడార్:

ఎల్ సాల్వెడార్:

బిట్‌కాయిన్‌ను చట్టబద్ధమైన కరెన్సీగా కలిగి ఉన్న దేశం ఎల్ సాల్వెడార్. 800 మిలియన్ డాలర్ల విలువైన బాండ్‌లు ఇప్పటికే 30% తగ్గింపుతో ట్రేడ్ అవుతున్నాయి. దీర్ఘకాలిక బాండ్లను 70% తగ్గింపుతో విక్రయిస్తున్నారు. ఈ దేశం మీద నమ్మకం పడిపోవటంతో ఐఎంఫ్ సైతం ఈ దేశానికి తలుపులు మూసింది.

పాకిస్తాన్:

పాకిస్తాన్:

శ్రీలంక తరువాత ఆ పరిస్థితులు పొరుగు దేశం పాకిస్థాన్ కు వస్తాయా..? పాకిస్థాన్ IMFతో ఒప్పందం కుదుర్చుకున్నప్పటికీ, అది ఇంకా పూర్తి కాలేదు. నానాటికీ పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య విదేశీ మారక ద్రవ్య నిల్వలు క్షీణించడం, రుణ సమస్యలు వంటి అనేక ఇబ్బందులు పాకిస్తాన్ ను వెంటాడుతున్నాయి. పాకిస్థాన్ రూపాయి అనూహ్యంగా క్షీణించింది. తన సంపాదనలో దాదాపు 40% వడ్డీ చెల్లింపుల కోసం వినియోగిస్తున్నట్లు దాయాది దేశం తెలిపింది.

బెలారస్ & ఈక్వెడార్:

బెలారస్ & ఈక్వెడార్:

పాశ్చాత్య దేశాల నుంచి వివిధ ఆర్థిక ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యాతో పాటు బెలారస్ కూడా పలు సమస్యలను ఎదుర్కొంటోంది. దీనికి తోడు ఈక్వెడార్.. రెండేళ్ల క్రితం భారీ రుణ సంక్షోభంతో కుదేలైంది. దానితో పాటు.. హింసాత్మక నిరసనలు, దేశ అధ్యక్షుడిని తొలగించే అంశం కూడా ఉంది. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. సబ్సిడీ, ఆహార సబ్సిడీ, ఇంధన సబ్సిడీ వంటి అనేక అంశాల కారణంగా ఇప్పటికే ఆర్థిక కొరతను ఎదుర్కొంటోంది.

నైజీరియా:

నైజీరియా:

నైజీరియా కూడా తన ఆదాయంలో దాదాపు 30% అప్పుపై వడ్డీలు చెల్లించేందుకే వెచ్చిస్తోంది. కాబట్టి ఈ దేశానికి అప్పుల భారం ఎక్కువగానే ఉంది. ఇప్పటిదాకా మాట్ాడుకున్న అనేక దేశాలు అధిక అప్పుల కారణంగా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ దేశాలు ప్రస్తుతం తమ ఆర్థిక వ్యవస్థలను నడిపించేందుకు మరిన్ని అప్పులు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.Source link

Leave a Reply

Your email address will not be published.