today telugu panchangam : హిందూ మరియు వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాల నిమిత్తం పంచాంగాన్ని పక్కాగా చూస్తారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం ఈ ఐదింటిని కలిపి పంచాంగం అంటారు. ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి ముఖ్యమైన విషయాల గురించి వివరిస్తుంది. పంచాగం లెక్కించడానికి అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నప్పటికీ ఇప్పటికీ సూర్యమానం, చాంద్ర మానం విధానాలనే అనుసరిస్తున్నారు. సూర్యుడి సంచారంతో అనుసంధానమైనది సూర్యమాన పంచాంగం, అదే విధంగా చంద్రుని సంచారంతో అనుసంధానమైనది చంద్రుని పంచాంగం. మన తెలుగువారు ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. అందుకే చాంద్రమానం ప్రకారం, తెలుగు నూతన సంవత్సరం ఛైత్ర మాసంతో ప్రారంభమవుతుంది. ఫాల్గుణ మాసంతో ముగుస్తుంది. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. ఈ సందర్భంగా నేటి 18 జూలై(July) సోమవారం వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

రాష్ట్రీయ ఆషాఢ మితి 27, శాఖ సంవత్సరం 1944, ఆషాఢ సోమవారం విక్రమ సంవత్సరం 2079. జిల్హిజా 18, హిజ్రీ 1443(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 18 జూలై 2022
సూర్యుడు దక్షిణయానం నుండి ఉత్తర ప్రదక్షిణ, వర్ష బుుతువు.

Most Angry Zodiac Sign : ఈ 5 రాశుల వారికి కోపం వస్తే ఆపడం కష్టమే..!

రాహుకాలం : ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు పంచమి తిథి ఉదయం 8:56 గంటల తర్వాత ప్రారంభమవుతుంది. అనంతరం షష్టి తిథి ప్రారంభమవుతుంది. పూర్వాభాద్రపద నక్షత్రం మధ్యాహ్నం 12:24 గంటల తర్వాత ఉత్తరాభాద్ర పద నక్షత్రం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 3:26 గంటల తర్వాత శోభన యోగం, అతి గండ యోగం ప్రారంభమవుతుంది.

నేడు ఉపవాస పండుగ : నాగ పంచమి(రాజస్థాన్, బెంగాల్)

సూర్యోదయం సమయం 18 జులై 2022: ఉదయం 5:34 గంటలకు
సూర్యాస్తమయం సమయం 18 జులై 2022 : సాయంత్రం 7:20 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..
బ్రహ్మా ముహుర్తం : తెల్లవారుజామున 4:13 నుండి 4:54 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:45 నుండి మధ్యాహ్నం 3:40 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:07 గంటల నుండి రాత్రి 12:48 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 7:06 నుండి సాయంత్రం 7:30 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 5:34 నుండి ఉదయం 7:17 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : సాయంత్రం 7:30 నుండి రాత్రి 9 గంటల వరకు
గులిక్ కాలం : మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు
యమగండం : ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు
దుర్ముహర్తం : మధ్యాహ్నం 12:55 నుండి మధ్యాహ్నం 1:50 గంటల వరకు తిరిగి, మధ్యాహ్నం 3:40 నుండి సాయంత్రం 4:35 గంటల వరకు

– ఆచార్య కృష్ణ దత్త శర్మ



Source link

Leave a Reply

Your email address will not be published.