బలమైన లాభాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది టాటాలకు చెందిన Tata Elxsi స్టాక్ గురించే. ఇది ఒక ఐటీ కంపెనీ. ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బలమైన లాభాలను నమోదు చేసింది. వ్యాపార కార్యకలాపాల ద్వారా కంపెనీ రూ.725.9 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. అన్ని టాక్సులు చెల్లించిన తరువాత రూ.184.7 కోట్ల లాభాన్ని గడించింది. కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.50,250.24 కోట్లుగా ఉంది.

Tata Elxsi షేర్ చరిత్ర..

Tata Elxsi షేర్ చరిత్ర..

భారతీయ స్టాక్ మార్కెట్‌లో గత కొన్ని సంవత్సరాలుగా అద్భుతమైన రాబడిని అందించిన మల్టీబ్యాగర్ స్టాక్‌లలో టాటా గ్రూప్ కు చెందిన Tata Elxsi ఒకటి. టాటా Elxsi షేర్ YTD ప్రాతిపధికన 36.67% రాబడిని ఇచ్చింది. ఈ కాలంలో చాలా IT స్టాక్‌లు తమ పెట్టుబడిదారులకు సున్నా రాబడిని ఇచ్చాయి. ఈ ఐటీ స్టాక్ గత ఏడాది కాలంలో 80 శాతం రాబడిని అందించగా.. గత 5 సంవత్సరాల్లో ఏకంగా 858.47 శాతం రాబడిని ఇచ్చింది.

పెన్నీ స్టాక్ గా ప్రారంభమై..

పెన్నీ స్టాక్ గా ప్రారంభమై..

25 సంవత్సరాల క్రితం జూలై 11, 1997న BSEలో ఈ షేర్ ధర రూ.7.68గా ఉంది. ఈ రోజు మార్కెట్ విలువ ప్రకారం ఈ స్టాక్ రేటు రూ. 8,078 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ స్టాక్ గత 9 ఏళ్లలో 9274.09% రాబడిని ఇచ్చింది. ఈ సమయంలో 23 ఆగస్టు 2013న.. స్టాక్ రూ.86.13 నుంచి ప్రస్తుత ధరకు పెరిగింది. 25 సంవత్సరాల క్రితం ఒక ఇన్వెస్టర్ ఈ స్టాక్ లో లక్ష రూపాయిలు పెట్టుబడి పెట్టినట్లయితే.. ప్రస్తుతం దాని విలువ రూ. 10.50 కోట్లు అయి ఉండేది. ఈ స్టాక్ లో దీర్ఘకాలం పాటు తమ పెట్టుబడులను కొనసాగించిన ఇన్వెస్టర్లకు మంచి రాబడిని పొందారు.Source link

Leave a Reply

Your email address will not be published.