ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి ఉత్పత్తులు.

ఢిల్లీకి చెందిన పారిశ్రామికవేత్త కనికా అహుజా ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగించి బ్యాగ్‌లు, ల్యాప్‌టాప్ స్లీవ్‌లు, మ్యాట్‌లు, ఫ్యాషన్ వస్తువులను తయారు చేసే లిఫాఫా సంస్థను ప్రారంభించింది. ప్లాస్టిక్ వ్యర్థాలు కొండలా పేరుకుపోకుండా ఈమె చేస్తున్న ప్రయత్నం సహాయపడుతోంది. వ్యర్థాల నుంచి ప్రజల దృష్టిని ఆకర్షించే ఉత్పత్తులను తయారు చేస్తోంది.

NGO స్థాపించి..

NGO స్థాపించి..

1998లో కనికా తల్లిదండ్రులు అనిక, షాలప్ అహుజాలు.. కన్జర్వ్ ఇండియా అనే NGOని స్థాపించారు. దీని ద్వారా ఢిల్లీలో ప్లాస్టిక్ మహమ్మారిని నిర్మూలించేందుకు కృషి చేయడం ప్రారంభించారు. కనికా కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ నుంచి ఇంజనీరింగ్ తో పాటు ఢిల్లీలోని SRCCలో MBA విద్యను పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక 2015లో మార్కెటింగ్ రీసెర్చ్ కంపెనీలో ఉద్యోగం చేయడం ప్రారంభించింది.

 లిఫాఫా ప్రారంభం..

లిఫాఫా ప్రారంభం..

లిఫాఫా కంపెనీ.. భారత్, అమెరికా, ఐరోపాలో అప్‌సైకిల్ ప్లాస్టిక్ ఉత్పత్తులను డిజైన్ చేసి మార్కెట్ చేసే బ్రాండ్‌గా కూడా పరిణామం చెందింది. ఈ కంపెనీ తయారు చేసిన ఉత్పత్తుల ద్వారా.. దాదాపు 12 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలను పర్సులు, బ్యాగులు, ల్యాప్‌టాప్ స్లీవ్‌లు, టేబుల్ మ్యాట్‌లు, అనేక ఇతర ఉత్పత్తులుగా మార్చింది.

రీసైక్లింగ్ ద్వారా చెత్త డబ్బాల్లో ప్లాస్టిక్‌ పేరుకుపోకుండా తన ప్రయత్నం సహాయపడుతోందని కనిక వెల్లడించింది. ఇలా గత ఆర్థిక సంవత్సరం ఉత్పత్తుల అమ్మకం ద్వారా కోటి రూపాయల మార్కును చేరుకున్నట్లు ఆమె వెల్లడించింది. ఇందుకోసం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలను బ్యాగ్‌లుగా మార్చే సాంకేతికతను అభివృద్ధి చేశారు.

ఫైనాన్సింగ్..

ఫైనాన్సింగ్..

లిఫాఫాను ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లేందుకు కనికా ప్రయత్నిస్తోంది. కార్యకలాపాలను పెంచేందుకు అవసరమైన పెట్టుబడుల కోసం.. గ్లోబల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ అశోకా నుంచి ఫండింగ్ అందుకుంది.

లాక్మే ఫ్యాషన్ వీక్ లో..

లాక్మే ఫ్యాషన్ వీక్ లో..

సింగిల్ యూజ్ ప్లాటికిన్‌ని రీసైకిల్ చేసిన మెటీరియల్ ఉపయోగించి.. అలంకరణ వస్తువులు, సాంప్రదాయ హస్తకళలతో పాటు ఇతర వస్తువులను తయారు చేస్తున్నారు. 2017 లాక్మే ఫ్యాషన్ వీక్ లో కంపెనీ తన ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంటింది. కానీ కరోనా కారణంగా కంపెనీ కొంత అంతరాయాన్ని ఎదుర్కొంది. లెథర్ కు ప్రత్యామ్నాయంగా ఈ ఉత్పత్తులు నిలుస్తాయని ఆమె తెలిపింది. సంస్థ గ్లోబల్ రీసైక్లింగ్ స్టాండర్డ్ గుర్తింపును కూడా పొందింది. ప్రపంచంలో చాలా దేశాలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తున్న వేళ.. కనికా వ్యాపార ఆలోచన దీనికి మరింత దోహదం చేస్తుంది.Source link

Leave a Reply

Your email address will not be published.