కొత్త పెట్టుబడులు..

ఇంతకీ విషయం ఏమిటంటే.. సెలబ్రిటీ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా జూన్ 2022తో ముగిసిన క్వార్టర్ లో ఒక కొత్త స్టాక్‌ని తన పోర్ట్ ఫోలియోలో చేర్చారు. బిలియనీర్ ఇన్వెస్టర్ గతంలో డిసెంబర్ 21 వరకు ఈ స్టాక్‌ను కలిగి ఉన్నారు. అయితే మార్చి -2022లో ఆటో కంపెనీ స్టాక్ నుంచి జున్‌జున్‌వాలా పూర్తిగా డబ్బును వెనక్కు తీసుకున్నారు. తాజాగా ఆయన.. ప్రముఖ ట్రాక్టర్ తయారీ సంస్థ ఎస్కార్ట్స్ కుబోటా స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టారు.

33 కంపెనీల్లో పెట్టుబడులు..

33 కంపెనీల్లో పెట్టుబడులు..

తాజా షేర్ హోల్డింగ్‌ల ప్రకారం.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో బిగ్ బుల్ ఎస్కార్ట్స్ కుబోటాలో 1.39% వాటాను కొనుగోలు చేశారు. అంటే.. 18,30,388 షేర్లను కొనుగోలు చేశారు. తాజా కార్పొరేట్ ఫైలింగ్‌ల ప్రకారం.. ఇటీవల ముగిసిన త్రైమాసికంలో ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా 33 స్టాక్‌లను తన పోర్ట్ ఫోలియోలో కలిగి ఉన్నారు. ఈ స్టాక్‌ల నికర విలువ జూలై 20 నాటికి రూ. 29,155 కోట్లుగా ఉంది.

కుబోటా షేర్లు ఇలా..

కుబోటా షేర్లు ఇలా..

ఎస్కార్ట్స్ కుబోటా(Escorts Kubota) షేర్లు ఎన్ఎస్‌ఈలో ఒక్కో షేరు విలువ మధ్యాహ్నం 12.40 సమయానికి రూ.31 తగ్గి రూ.1724.45 వద్ద ట్రేడవుతోంది. ఎస్కార్ట్స్ కుబోటా స్టాక్ గత సంవత్సర కాలంలో దాదాపు 50% రాబడిని ఇచ్చింది. ఇదే సమయంలో స్టాక్ 10 ఏళ్లలో 2500% కంటే ఎక్కువ రాబడిని అందించింది. గడిచిన ఒక నెలలోనే షేర్ 17 శాతానికిపైగా పెరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 5న ఆటో స్టాక్ 52 వారాల గరిష్ఠ స్థాయి అయిన రూ.1,930ని తాకింది.

ఎస్కార్ట్స్ కుబోటా కంపెనీ గురించి..

ఎస్కార్ట్స్ కుబోటా కంపెనీ గురించి..

ప్రముఖ ట్రాక్టర్, వ్యవసాయ యంత్రాల తయారుచేసే ఎస్కార్ట్స్ లిమిటెడ్‌ను.. “ఎస్కార్ట్స్ కుబోటా లిమిటెడ్”గా రీబ్రాండ్ చేయటానికి అనుమతి పొందింది. ఈ విషయాన్ని కంపెనీ జూన్ 9, 2022న తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ నిర్ణయం జపనీస్ సంస్థ కుబోటా.. ఎస్కార్ట్స్‌ కంపెనీలో తన పెట్టుబడులను పెంచి 44.8% ఈక్విటీ వాటాను చేజిక్కించుకోవటంతో వచ్చింది.Source link

Leave a Reply

Your email address will not be published.