రిజర్వు బ్యాంక్..

కేంద్ర ప్రభుత్వ ఆమోదంతో ఆర్‌బీఐ అభివృద్ధి చేసిన రూపాయి చెల్లింపు విధానం రష్యా, ఇరాన్ వంటి దేశాలకే కాకుండా శ్రీలంకకు కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూర్చనుంది. శ్రీలంక ఆర్థిక వ్యవస్థ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నందున.. భారత రూపాయితో పోలిస్తే శ్రీలంక రూపాయి విలువ రూ.0.22కి పడిపోయింది.

భారత కరెన్సీ..

భారత కరెన్సీ..

శ్రీలంక ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచేందుకు అనేక ముఖ్యమైన రంగాలు, ఇతర రంగాల్లో శ్రీలంక రూపాయికి బదులుగా భారత రూపాయిని ఉపయోగించాలని నిర్ణయించినట్లు సమాచారం.

శ్రీలంక ఆర్థిక వ్యవస్థ..

శ్రీలంక ఆర్థిక వ్యవస్థ..

కరోనా సంక్షోభం సమయంలో శ్రీలంక ఆర్థిక వ్యవస్థ 2020లో -3.5 శాతానికి పడిపోయింది. ఇదిలా ఉండగా.. ఈ ఏడాది శ్రీలంక ఆర్థిక వ్యవస్థ -6 శాతానికి పైగా క్షీణించనుందని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ ఛైర్మన్ నందలాల్ వీరసింగ్ ప్రకటించారు. దీనికి తోడు పెరుగుతున్న ప్రజాగ్రహం గాడిన పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు అవరోధాలను కలిగిస్తోంది.

ఒక్క నిర్ణయంతో..

ఒక్క నిర్ణయంతో..

శ్రీలంక కరెన్సీ మార్పిడి నిర్ణయం ఆ దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి కొత్త పెట్టుబడులను ఆకర్షింటడంలో ఉపయుక్తంగా మారతాయి. భారతీయ కరెన్నీ వినియోగించి చెల్లింపులు చేసినప్పుడు ద్వీపదేశానికి విదేశీ మారక నిల్వలు చాలా వరకు ఆదా అవుతాయి.

రోషన్ పెరీరా

రోషన్ పెరీరా

అదే సమయంలో.. శ్రీలంక రూపాయికి సమానంగా భారత రూపాయిని ఉపయోగించడం సరైనది కాదని శ్రీలంక సెంట్రల్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, అడ్వకేటియా సీనియర్ అధికారి రోషన్ పెరీరా అభిప్రాయపడ్డారు. శ్రీలంకలో రెండో కరెన్సీగా భారత రూపాయి వినియోగం సరైనది కాదని ఆయన అన్నారు.

రెండు కరెన్సీలు..

రెండు కరెన్సీలు..

కానీ.. ఇప్పటికే జింబాబ్వే, ఎల్ సాల్వడార్ వంటి అనేక దేశాలు రెండు కరెన్సీలను ఉపయోగిస్తున్నాయి. కాబట్టి.. పొరుదు దేశం శ్రీలంకలోని కొత్త ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుంది అనేది ప్రస్తుతం ముఖ్యమైన సమస్య.Source link

Leave a Reply

Your email address will not be published.