బుల్ జోరుకు కారణాలు ఇవే..

ప్రస్తుతం భారత మార్కెట్ పైకి ప్రయాణాన్ని కొనసాగించడంతో దలాల్ స్ట్రీట్‌లో బుల్ జోరు కొనసాగుతోంది. మార్కెట్లు ప్రస్తుతం బుల్స్ చేతిలోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. మెరుగైన గ్లోబల్ సెంటిమెంట్‌లు, తగ్గిన ఎఫ్‌ఐఐల విక్రయాలు, కమోడిటీ ధరల తరుగుదల వంటి సానుకూల పరిణామాల మధ్య బెంచ్‌మార్క్ సూచీల్లో అత్యధికంగా ఒక శాతం జంప్ కు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి.

ఈ వారం లాభాలు..

ఈ వారం లాభాలు..

నిఫ్టీ- 50 బెంచ్‌మార్క్ సూచీ దాదాపు ఒక శాతం లాభంతో 16,500 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే.. మరో కీలక సూచీ సెన్సెక్స్ ఈ క్రమంలో దాదాపు 600 పాయింట్లకు పైగా లాభపడి 55,400 దగ్గర స్థిరపడింది. అయినప్పటికీ మార్కెట్ ముగింపు గంటల్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మెుగ్గుచూపటంతో కొంత అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఈ వారంలో బెంచ్‌మార్క్ సూచీలు నిఫ్టీ, సెన్సెక్స్‌లు దాదాపు 3% లాభపడ్డాయి. ద్రవ్యోల్బణం పెద్ద సమస్యగా ఉన్నప్పటికీ.. భారత మార్కెట్లు ఇప్పటికే చెడ్డ పరిస్థితులను దాటాయని, ఇకపై మార్కెట్లు పుంజుకుంటాయని నిపుణులు భావిస్తున్నారు.

కేంద్రం నిర్ణయంతో లాభాల పంట..

కేంద్రం నిర్ణయంతో లాభాల పంట..

ఈ రోజు ట్రేడింగ్ సెషన్‌లో నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.15 శాతం లాభపడగా, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, బ్యాంక్ నిఫ్టీ 251 పాయింట్ల మేర లాభపడ్డాయి. మార్కెట్లను ప్రధానంగా ఐటీ, ఎనర్జీ సెక్టార్ల షేర్లు ముందుకు నడిపించాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై విండ్ ఫాల్ టాక్స్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటున్నాట్లు ప్రకటించడంతో ఎనర్జీ సెక్టార్ కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్జీసీ, చెన్నై పెట్రోలియం కార్పొరేషన్, మంగళూరు రిఫైనరీ, గెయిల్ వంటి సంస్థలు లాభాపడ్డాయి.

గెయినర్స్ అండ్ లూజర్స్..

గెయినర్స్ అండ్ లూజర్స్..

ఓఎన్‌సీజీ, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌, రిలయన్స్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇన్ఫోసిస్‌, విప్రో, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, టైటాన్‌లు సానుకూల మార్కెట్‌లో దూసుకుపోయాయి భారీగా లాభపడ్డాయి. ఇదే సమయంలో.. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఐషర్ మోటార్స్, సన్ ఫార్మా, అదానీ పోర్ట్స్, బజాజ్ ట్విన్స్, భారతీ ఎయిర్‌టెల్ స్టాక్స్ నష్టాలను చవిచూసాయి.Source link

Leave a Reply

Your email address will not be published.