స్నానం చేసిన వెంటనే బొట్టు పెట్టుకోవచ్చా?

స్నానం చేసిన వెంటనే బొట్టు లేకుంటే చాలామంది ఇళ్లల్లో పెద్దలు కోప్పడుతూ ఉంటారు. కానీ తలస్నానం చేసిన వెంటనే తడి శరీరం మీద బొట్టు పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మీరు తలస్నానం చేసిన వెంటనే సింధూరాన్ని దిద్దుకోవడం వల్ల మీరు ఆర్థిక మందగమనాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. మీరు తలస్నానం చేసిన తర్వాత కూడా వెంటనే, తడిగా ఉన్న జుట్టులో సింధూరాన్ని పెట్టకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. జుట్టు ఆరిన తర్వాతనే సింధూరం పెట్టుకోవాలని సూచిస్తున్నారు

తల స్నానం చేసిన వెంటనే నుదుటిన సింధూరం పెట్టుకోవచ్చా?

తల స్నానం చేసిన వెంటనే నుదుటిన సింధూరం పెట్టుకోవచ్చా?

తడి వెంట్రుకలపై సింధూరాన్ని దిద్దుకోవడం ద్వారా, అన్ని సమయాలలో, సందిగ్ధతకు గురవుతారు మరియు చెడు ఆలోచనలు మనస్సులో పెరుగుతాయని సూచిస్తున్నారు. ముందుగా తడి జుట్టును ఆరబెట్టి, ఆపై సింధూరం దిద్దుకోవాలని చెబుతున్నారు. అంతేకాదు సింధూరం దిద్దుకునేటప్పుడు, ఇతర స్త్రీలను సింధూరాన్ని తీసుకొని మీ ముఖాలపై పెట్టుకోవడం కూడా అనర్థాలకు కారణమవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీంతో భర్త ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది.

సింధూరాన్ని ఇతర మహిళలతో పంచుకోవచ్చా?

సింధూరాన్ని ఇతర మహిళలతో పంచుకోవచ్చా?

మీ సింధూరాన్ని కూడా ఏ ఇతర వివాహిత స్త్రీకి ఎప్పుడూ ఇవ్వకూడదని చెబుతున్నారు. అలా చేయడం అశుభం అని భావిస్తారు. ఎల్లప్పుడూ మీ భర్త డబ్బుతో మాత్రమే సింధూరాన్ని కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. ఇతరుల డబ్బుతో ఎప్పుడూ సింధూరాన్ని కొనకూడదని చెబుతున్నారు. చాలా మంది మహిళలు తమ జుట్టులోపల సింధూరాన్ని దిద్దుకుంటారు. ఇలా చేయకూడదు, ఎందుకంటే అలా చేయడం వివాహ సంబంధాన్ని ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు.

 బొట్టు పెట్టుకోవడానికి విధానం.. ఏ వేలితో సింధూరం దిద్దుకోవాలి అంటే

బొట్టు పెట్టుకోవడానికి విధానం.. ఏ వేలితో సింధూరం దిద్దుకోవాలి అంటే

అంతేకాదు బొట్టు పెట్టుకోవడానికి కూడా ఒక విధానం ఉంటుందని, ఏ వేలితో బొట్టు పెట్టుకుంటే మంచిది అనే అంశం పైన కూడా వాస్తు శాస్త్ర నిపుణులు క్లారిటీ ఇస్తున్నారు. బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో వేలు ఉపయోగిస్తూ ఉంటారు. కొందరు మధ్యవేలు మంచిదని, కొందరు బొటనవేలు మంచిదని, కొందరు ఉంగరపువేలు మంచిదని చెబుతుంటారు. అయితే చూపుడు వేలుతో బొట్టు పెట్టడం మాత్రం మంచిది కాదని చెప్పారు. ఉంగరపు వేలుతో బొట్టు పెట్టుకుంటే శాంతి, జ్ఞానం వస్తుందని, మధ్య వేలుతో బొట్టు పెట్టుకుంటే ఆయువు, సంపద వస్తాయని చెబుతారు. బొటన వేలుతో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుందని, అలా బొట్టు పెట్టుకోవడం వల్ల అందం రెట్టింపు అవుతుందని కూడా చెబుతారు. ఇక చూపుడు వేలుతో బొట్టు పెట్టుకుంటే ముక్తి లభిస్తుందని అందుకే ఆ వేలితో బొట్టు పెట్టుకోకూడదు అని చెప్తారు.Source link

Leave a Reply

Your email address will not be published.