ఎమోషనల్
ఇంటెలిజెన్స్
అంటే
ఏమిటి?

ఎమోషనల్
ఇంటెలిజెన్స్
(EI)
ఆలోచన,
అనుభూతి,
నిర్ణయం
తీసుకోవడం,
నేర్చుకోవడం
మరియు
సమస్య
పరిష్కారానికి
ముఖ్యమైనది.
జర్నల్
బిహేవియరల్
సైన్సెస్‌
లో
ప్రచురించబడిన
ఒక
అధ్యయనం
ప్రకారం..
EI
అనేది
భావోద్వేగాలను
గుర్తించి,
వాటిని
అర్థం
చేసుకోవడంలో
ముఖ్య
పాత్ర
పోషిస్తాయి.
సామర్ధ్యం,
కమ్యూనికేషన్,
తాదాత్మ్యం,
సమస్య-పరిష్కారంలో

ఎమోషనల్
ఇంటెలిజెన్స్
ముఖ్య
పాత్ర
పోషిస్తుంది.
సంఘర్షణ
నిర్వహణలో
వాటిని
సానుకూలంగా
ఉపయోగించడం
ఎలాగే
ఎమోషనల్
ఇంటెలిజెన్స్
ఉన్న
వారికి
తెలుస్తుంది.

ఎమోషనల్
ఇంటెలిజెన్స్
ఎవరిలో
ఉంటుంది?

కొంత
మంది
వ్యక్తుల్లో
ఎమోషనల్
ఇంటెలిజెన్స్
అనేది
పుట్టుకతో
వచ్చే
లక్షణం.
అయితే
చాలా
మందిలో
అది
నేర్చుకుంటే
కూడా
వస్తుంది.
క్రమంగా
ఎమోషనల్
ఇంటెలిజెన్స్
ను
బలంగా
తయారు
చేసుకుంటారు.
EI
ఎక్కువగా
ఉన్న
వ్యక్తులకే
చాలా
మంది
ప్రాధాన్యత
ఇస్తారు.

EI అంత అవసరమా?

EI
అంత
అవసరమా?

*
బంధం
బలంగా
ఉండాలని
కోరుకునే
వారు,
కలకాలం
నిలవాలని
తపించే
వారు
ఎమోషనల్
ఇంటెలిజెన్స్
EI
ఉన్న
వ్యక్తులనే
కోరుకుంటున్నారు.

*
మానసికంగా
తెలివైన
వారితోనే
బంధం
ఏర్పరచుకోవాలని
భావిస్తున్నారు.

*
భాగస్వాములు
మానసికంగా
దృఢంగా
ఉండాలని
అనుకుంటున్నారు.

*
మనల్ని
లోతుగా
అర్థం
చేసుకోవాలని,
సమస్యలు
వచ్చినప్పుడు
అండగా
నిలవాలని
కోరుకుంటున్నారు.

మానసికంగా తెలివైన భాగస్వాములు ఉత్తమంగా ఉండటానికి ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి.

మానసికంగా
తెలివైన
భాగస్వాములు
ఉత్తమంగా
ఉండటానికి
ఇక్కడ
కొన్ని
కారణాలు
ఉన్నాయి.

1.
మైండ్‌ఫుల్
లివింగ్

మైండ్‌ఫుల్
లివింగ్
అంటే
సంతోషకరమైన
జీవితాన్ని
నిర్ధారించడానికి
మన
మాటలు,
ఆలోచనలు
మరియు
చర్యలపై
పూర్తి
నియంత్రణ
కలిగి
ఉండటం.
భావోద్వేగపరంగా
తెలివైన
వ్యక్తులు
ప్రతి
రోజూ
కొత్త
విషయాలని
నేర్చుకోవడానికి
పాఠాలు
చెబుతాయని
భావిస్తారు.
కష్టాలు
వచ్చినా
అదే
రకమైన
ధోరణితో
ఉంటారు.
సమస్యలను
ధైర్యంగా
ఎదుర్కొంటారు.
వాటి
నుండి
పాఠాలు
నేర్చుకుని
భవిష్యత్తులో
ఉపయోగిస్తారు.

2. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్

2.
మంచి
కమ్యూనికేషన్
స్కిల్స్

ఎమోషనల్
ఇంటెలిజెన్స్
ఉన్న
వారు
ఎదుటి
వారితో
మంచి
కమ్యూనికేషన్
ఏర్పరచుకుంటారు.
వారు
చెప్పాలనుకున్నది
స్పష్టంగా,
ఎలాంటి
తొత్రుపాటు
లేకుండా
చెప్పేస్తారు.
ఎదుటి
వారి
నుండి
వారికి
ఏం
తెలియాలో
వారికి
తెలిసి
ఉంటుంది
కాబట్టి
దానిని
రాబట్టుకోగలరు.
ఒక
అధ్యయనం
ప్రకారం
EI
కలిగిన
వ్యక్తులకు
ఎఫెక్టివ్
కమ్యూనికేషన్
స్కిల్స్
ఉంటాయని
తెలిసింది.
కమ్యూనికేషన్
విషయానికి
వస్తే
మానసికంగా
తెలివైన
వ్యక్తులు
ప్రభావవంతంగా
కమ్యూనికేట్
చేస్తారని
వెల్లడైంది

3. చక్కని శ్రోతలు

3.
చక్కని
శ్రోతలు

EI
ఉన్న
వ్యక్తులు
కమ్యూనికేట్
చేయడంలో
ఎంత
చురుకుగా
ఉంటారో..
స్వీకరించడంలోనూ
అంతే
యాక్టివ్
గా
ఉంటారు.
ఎదుటి
వారు
చెప్పేది
సావధానంగా
వింటారు.
ముఖ్యంగా
భాగస్వాములు
చెప్పేదానిని
విని
అర్థం
చేసుకుంటారు.
అలాగే
వారు
చెప్పేదానిని
ఎలాంటి
పరిస్థితుల్లోనూ
విస్మరించరు.

4. మధ్యలో వదిలిపెట్టరు

4.
మధ్యలో
వదిలిపెట్టరు

భావోద్వేగపరంగా
తెలివైన
వ్యక్తులు
లక్ష్యం
కోసం
పని
చేస్తారు.
లక్ష్యాన్ని
చేరుకునే
వరకు
విశ్రమించరు.
వారు
తమ
లక్ష్యాన్ని
సాధించే
వరకు
నిష్క్రమించబోమన్న
మనస్తత్వం
కలిగి
ఉంటారు.
అడ్డంకులు
వచ్చినప్పుడు
వాటిని
ఎదుర్కొని
నిలబడతారు.
కానీ
వాటి
చూసి
పారిపోరు.
సమస్యలు
వచ్చినప్పుడు
వాటిని
పరిష్కరించడానికి
ప్రయత్నిస్తారు.

5. వారికి నో చెప్పడం ఎలాగో తెలుసు

5.
వారికి
నో
చెప్పడం
ఎలాగో
తెలుసు

ఎమోషనల్
ఇంటెలిజెన్స్
ఉన్న
వారు
సందర్భోచితంగా
మెలుగుతారు.
వారు
చెప్పాలనుకున్నది
నిరభ్యంతరంగా
చెప్పేస్తారు.
అది
కూడా
ఎదుటి
వారి
మనసును
గాయపరచకుండా
వివరిస్తారు.
వారికి
నో
ఎక్కడ,
ఎలా
చెప్పాలో
తెలిసి
ఉంటుంది.
వారు
తమ
పట్ల
ఉన్నంతగా
ఇతరుల
పట్ల
సానుభూతి
కలిగి
ఉంటారు.

6. వారికి హద్దులు తెలుసు

6.
వారికి
హద్దులు
తెలుసు

ప్రతి
బంధంలోనూ
హద్దులు
ఉంటాయి.
వాటిని
అర్థం
చేసుకుని
జీవించినప్పుడే

బంధం
కలకాలం
ఉంటుంది.
భాగస్వాములు
అయినా
సరే
కొన్ని
హద్దులు
ఉంటాయి.
వాటిని
దాటినప్పుడు
బంధం
చీలిపోయే
ప్రమాదం
ఉంటుంది.
EI
ఉన్న
వారికి
వారి
హద్దులు
వారికి
తెలుస్తాయి.
వాటిని
బట్టి
ఎల్లప్పుడు
మెలుగుతారు.

7. ఎప్పుడు రాజీ పడాలో తెలుసు

7.
ఎప్పుడు
రాజీ
పడాలో
తెలుసు

ప్రతి
బంధంలో
అప్పుడప్పుడు
గొడవలు
జరగడం
సర్వ
సాధారణం.
అలాగని
చిన్న
పాటి
వివాదానికి
విడిచి
వెళ్లిపోవడం
మూర్ఖత్వం
అవుతుంది.
సంబంధం
ఉన్నప్పుడు
అందులో
హెచ్చుతగ్గులు
ఉంటాయని
తెలుసుకోవాలి.
EI
ఉన్న
వ్యక్తులు
ప్రాక్టికల్
గా
ఆలోచిస్తారు.
భాగస్వామితో
రాజీ
పడటానికి
వారెప్పుడూ
వెనకాడరు.
దానిని
చిన్న
చూపుగా
చూడరు.
దాని
వల్ల
బంధం
కలకాలం
ఉంటుందని
వారికి
తెలుసు.

8. నమ్మకంగా ఉంటారు

8.
నమ్మకంగా
ఉంటారు

ఎమోషనల్
ఇంటెలిజెన్స్
ఉన్న
వ్యక్తులు
నమ్మకమైన
వారు.
వారు
సంబంధాలను
కట్టుబాట్లుగా
పరిగణిస్తారు.
వారి
భాగస్వాములకు
విధేయంగా
ఉంటారు.

9. తప్పుడు వాగ్దానాలు చేయరు

9.
తప్పుడు
వాగ్దానాలు
చేయరు

మానసికంగా
తెలివైన
వ్యక్తులు
ఎల్లప్పుడూ
వారి
మాటలకు
కట్టుబడి
ఉంటారు.
వారు
నెరవేర్చలేని
వాగ్దానాలను
ఎప్పుడూ
చేయరు.

Source link

Leave a Reply

Your email address will not be published.