మహిళ ఏం చేసిందంటే..

తన జీతం వెల్లడించిన మహిళను అమెరికా కంపెనీ ఉద్యోగం నుంచి తొలగించింది. అమెరికాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్న లెక్సీ లార్సన్ అనే మహిళ తన జీతం గురించిన వీడియోను ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ టిక్‌టాక్‌లో పోస్ట్ చేయడంతో ఉద్యోగాన్ని కోల్పోయింది.

 ఉద్యోగం కోల్పోయింది..

ఉద్యోగం కోల్పోయింది..

మహిళ అమెరికాలోని డెన్వర్‌కు చెందిన లెక్సీ లార్సన్ తన ఉద్యోగాన్ని కోల్పోయింది. ఆమె గతంలో అకౌంట్స్ డిపార్ట్‌మెంట్‌లో పనిచేసేది. కొద్దిరోజుల క్రితం ప్రమోషన్ పొంది టెక్నికల్ విభాగానికి వచ్చింది. ఈ కారణంగా జీతం పెంపును కూడా పొందింది. ప్రమోషన్ కు ముందు ఆమెకు 70 వేల డాలర్లు జీతంగా వచ్చేది. అయితే తాజాగా తనకు 90 వేల డాలర్లు జీతం అందుకున్నట్లు తన టిక్‌టాక్‌ వీడియోలో తెలిపింది.

రహస్యాలను వెల్లడించిందని..

రహస్యాలను వెల్లడించిందని..

వీడియోలో కంపెనీకి సంబంధించిన కొన్ని రహస్యాలను వెల్లడించినందుకు ఆమె ఉద్యోగం కోల్పోయింది. లార్సెన్ కంపెనీపై కోర్టు ద్వారా చర్యలు తీసుకోవాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

చట్టం ఏమంటోంది..

US కార్మిక చట్టాల ప్రకారం ఉద్యోగులు తమ సహోద్యోగులతో జీతం గురించి చర్చించడానికి అనుమతి ఉంటుంది. అయితే.. కంపెనీ లోగోలను పంచుకోకుండా కొన్ని పరిమితులు ఉన్నాయి. మొత్తమ్మీద జీతం పెంపును అందుకున్నప్పటికీ ఉద్యోగం తొలగింపు సదరు మహిళకు ఖచ్చితంగా గుణపాఠం అవుతుందని కొందరు నెటిజన్లు అంటున్నారు.

దీన్ని అనుసరించండి..

ఉద్యోగులు తమ కంపెనీ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది లార్సెన్‌కు మాత్రమే కాదు.. పని చేస్తున్న కార్మికులందరికీ వర్తిస్తుంది. వీటిని పాటించటం వల్ల ఉద్యోగులు సమస్యల నుంచి మిమ్మల్ని రక్షిణ పొందవచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం కూడా మంచిదే.Source link

Leave a Reply

Your email address will not be published.