Saturday, April 17, 2021

30 ఏళ్ల లోపు వారికి ఆస్ట్రాజెనెకా వద్దు… ప్రత్యామ్నాయ వ్యాక్సిన్ ఇవ్వండి… : యూకె ప్రభుత్వ కమిటీ

International

oi-Srinivas Mittapalli

|

ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్ సమర్థతపై యూకెలో చాలా అనుమానాలు తలెత్తుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్నవారిలో ఇప్పటివరకూ 19 మంది మెదడులో రక్తం గడ్డ కట్టి చనిపోయారు. వీరంతా 18-79ఏళ్ల లోపువారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ ఇలా రక్తం గడ్డ కట్టిన కేసులు 79 వెలుగుచూశాయి. ఈ నేపథ్యంలో యూకె ప్రభుత్వానికి చెందిన కమిటీ ఒకటి కరోనా వ్యాక్సినేషన్‌పై కీలక సూచన చేసింది. 30 ఏళ్ల లోపు వాళ్లందరికీ ఆస్ట్రాజెనెకాకు బదులు ప్రత్యామ్నాయ వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించింది.

’18 నుంచి 29 ఏళ్ల వయసులో ఉండి… ఇప్పటివరకూ ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారందరికీ… ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు బదులు ప్రత్యామ్నాయ వ్యాక్సిన్ అందించాలి.’ అని వ్యాక్సినేషన్&ఇమ్యూనైజేషన్‌పై యూకె ప్రభుత్వం నియమించిన వెయిన్ షెన్ లిమ్ జాయింట్ కమిటీ వెల్లడించింది.

యూకెలో ఇటీవలి కాలంలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ తీసుకున్న 19 మంది రక్తం గడ్డ కట్టి చనిపోయారు. దీంతో వ్యాక్సిన్‌కు,రక్తం గడ్డ కట్టడానికి ఉన్న లింకును విశ్లేషిస్తున్నట్లు నిపుణులు వెల్లడించారు. ఈ సమాచారాన్ని విశ్లేషించేవరకూ చిన్నారులపై టీకా ట్రయల్స్‌ను నిలిపివేస్తున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

నిజానికి ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌పై మొదట్లో వచ్చిన ఆరోపణలను యూకె ప్రభుత్వం తోసిపుచ్చింది. కానీ వ్యాక్సిన్ కారణంగా రక్తం గడ్డ కట్టి చనిపోతున్నవారి సంఖ్య పెరుగుతుండటంతో… ఆ విషయాన్ని ధ్రువీకరించక తప్పలేదు. ఈ నేపథ్యంలో చాలా దేశాలు ఆస్ట్రాజెనెకా పంపిణీపై ఇప్పుడు ఆచి తూచీ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఐర్లాండ్,డెన్మార్క్,నార్వే,ఐస్‌లాండ్,ఆస్ట్రియా,నెదర్లాండ్స్ తదితర దేశాలు ఇప్పటికే ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌ పంపిణీ నిలిపివేశాయి. భారత్ మాత్రం ఆ వ్యాక్సిన్‌ను కొనసాగిస్తామని స్పష్టం చేసింది.

భారత్‌లో పుణేలోని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా కోవీషీల్డ్ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం నెలకు 6 నుంచి ఆరున్నర కోట్ల వ్యాక్సిన్ డోసులను ఉత్పత్తి చేస్తున్నట్లు ఆ కంపెనీ సీఈవో అదర్ పూనావాలా మంగళవారం(ఏప్రిల్ 6) వెల్లడించారు. ఇప్పటివరకూ భారత్‌కు 10 కోట్ల డోసులు,మరో 6 కోట్ల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేశామని అదర్ చెప్పారు. అయినప్పటికీ, దేశంలో వ్యాక్సిన్ అవసరమయ్యే ప్రతి ఒక్కరికీ అందించేందుకు ఎంతో దూరంలో ఉన్నామని ఆయన అన్నారు.వ్యాక్సిన్ ఉత్పత్తి విషయంలో తమపై చాలా ఒత్తిడి ఉందన్నారు.


Source link

MORE Articles

కరోనా : సందేహాలు, సమాధానాలు

ప్రస్తుతం భారతదేశంలో కరోనా సెకండ్ వెవ్ బలంగా ఉంది. పూర్తిస్థాయిలో కరోనా పరీక్షలు చేయకుండానే ప్రతిరోజు రెండు లక్షల పైబడి కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాల్లో అత్యధిక కేసులు నమోదవుతున్న రెండో...

Peloton is fighting a recall request on its treadmill after a child died last month

Peloton is resisting a request from the Consumer Product Safety Commission (CPSC) to recall its Tread Plus treadmill, which was involved...

Yes, Twitter was down — at least on the East Coast | Engadget

These days, fail whale sightings are few and far between, but Twitter appears to be suffering a serious outage at the moment. It's...

Internal memo: ByteDance seeks to increase China-based ad revenue from ~28B in 2020 to $39.8B in 2021; TikTok's Chinese twin Douyin had 610-620M DAUs...

Zheping Huang / Bloomberg: Internal memo: ByteDance seeks to increase China-based ad revenue from ~28B in 2020 to $39.8B in 2021; TikTok's Chinese...

Squarespace files to go public – TechCrunch

Squarespace is going public, Apple shares some music payment details and Twitter bans the founder of the right-wing media organization Project Veritas. This...

వైఎస్ షర్మిల నుంచి పిలుపు: కొండా సురేఖ దంపతులు ఏమన్నారంటే..?, జగన్‌పై సంచలనం

షర్మిల పార్టీ నుంచి పిలుపు ఈ క్రమంలోనే వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మంచి అనుంబంధం ఉన్న కొండా సురేఖ,...

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe