Saturday, July 24, 2021

5రాష్ట్రల అసెంబ్లీ ఎన్నికలు -మార్చి 7న షెడ్యూల్ -ఈసీ కంటే ముందే మోదీ హింట్ -బీజేపీ పక్కా

మార్చి 7న షెడ్యూల్..

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మార్చి మొదటి వారంలో విడుదలయ్యే అవకాశాలున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. గతం(2016)లో మార్చి నాలుగో తేదీన షెడ్యూల్‌ను ప్రకటించారని, ఈసారి కూడా అదే తేదీల్లో ప్రకటన వచ్చే అవకాశాలున్నాయన్నారు. ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయడం ఎన్నికల కమిషన్ విధి అంటూనే తేదీలను మోదీ పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు..

 బెంగాల్, అస్సాంలో మోదీ పర్యటన

బెంగాల్, అస్సాంలో మోదీ పర్యటన

త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న వెస్ట్ బెంగాల్, అస్సాం రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పర్యటించారు. ఎన్నికల వేళ రెండు రాష్ట్రాలకూ కేంద్రం తరఫున కీలక ప్రాజెక్టులు ప్రకటించారు. ఈసీ కంటే ముందే అంచనా తేదీలను వెల్లడించిన మోదీ.. ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించక మునుపే అసోం ,బెంగాల్‌లో పర్యటించడం సంతోషంగా ఉందని, అలాగే తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలోనూ పర్యటిస్తానని ప్రకటించారు. ఒకవేళ మార్చి ఏడో తేదీన గనక ఎన్నికల షెడ్యూల్ వస్తే… వీలైనంత తొందర్లోనే మరోసారి అసోం పర్యటనకు వస్తానని ఆయన తెలిపారు. కాగా,

అస్సాంలో మళ్లీ డబుల్ ఇంజన్

అస్సాంలో మళ్లీ డబుల్ ఇంజన్

ఈశాన్యంలో అతిపెద్ద రాష్ట్రమైన అస్సాంలో గడిచిన ఐదేళ్లుగా బీజేపీ సర్కారు కొనసాగుతుండటం తెలిసిందే. సోమవారం రాష్ట్రంలో పర్యటించిన ప్రధాని మోదీ.. వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. గత ప్రభుత్వాలు అసోంపై సవతి తల్లి ప్రేమను చూపించాయని, అభివృద్ధి చెందడానికి అవకాశాలున్నా, గత పాలకులెవరూ పట్టించుకోలేదని విమర్శించారు. అయితే, ఇప్పుడున్న సీఎం శర్వానంద సోనోవాల్ మాత్రం ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ నినాదంతో ముందుకెళుతున్నారని, కీలకమైన బ్రిడ్జిలు, రోడ్లతోపాటు విద్యుత్, విద్య విషయంలో కేంద్రం నుంచి అస్సాంకు రూ.3,000 కోట్లను కేటాయించామని మోదీ తెలిపారు. ప్రధాని పర్యటనలో ‘అస్సాంలో మళ్లీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది’అనే నినాదాలు వినిపించాయి. ఇక..

బెంగాల్‌లో మార్పు తథ్యం..

బెంగాల్‌లో మార్పు తథ్యం..

అస్సాంతోపాటు పశ్చిమ బెంగాల్ లోనూ సోమవారం పర్యటించిన ప్రధాని.. హౌరాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఈసారి బెంగాలీలు మార్పునకు సంసిద్ధంగా ఉన్నారని, తన సభకు భారీ సంఖ్యలో జనం రావడమే ఇందుకు తార్కాణమని అన్నారు. అస్సాంలాగే బెంగాల్ లోనూ ప్రధాని వివిధ అభివృద్ధి పథకాలను ప్రారంభించారు. కేంద్రం ప్రకటించిన పథకాలు బెంగాల్ ప్రజల్లోకి వెళ్లకుండా మమతా బెనర్జీ సర్కారు అడ్డుకుంటోందని మోదీ ఆరోపించారు. టీఎంసీ ప్రభుత్వం వ్యవస్థీకృత దోపిడీ చేస్తోందని, అందుకే తృణమూల్ నేతలు నానాటికీ సంపన్నులుగా మారుతున్నారని, ప్రజలు మాత్రం పేదలుగానే ఉండిపోతున్నారని విమర్శించారు. బీజేపీ గనుక అధికారంలోకి వస్తే అవినీతి రహిత, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో ఉన్న రాష్ట్రంగా బెంగాల్ ను మలుస్తామని మోదీ హామీ ఇచ్చారు.


Source link

MORE Articles

Second Hand Stress: कहीं आप दूसरों का तनाव तो नहीं झेल रहे, जान लें ये संकेत

तनाव एक नैचुरल मेंटल रिएक्शन है, जो विपरीत व मुश्किल परिस्थितियों के दौरान महसूस होता है. अत्यधिक तनाव लेना आपके मानसिक स्वास्थ्य के...

YS Viveka Murder: రంగయ్య ఇంటి వద్ద భారీ భద్రత-తెర పైకి 3 పేర్లు-హైకోర్టుకు సునీల్ యాదవ్?

తెర పైకి ముగ్గురి పేర్లు... జమ్మలమడుగు మెజిస్ట్రేట్‌లో రంగయ్య ఇచ్చిన వాంగ్మూలం సంచలనం రేపుతోంది. 9 మందికి ఈ హత్యలో ప్రమేయం ఉన్నట్లుగా రంగయ్య చెప్పారన్న ప్రచారం...

Protein rich Veg Foods: प्रोटीन लेने के लिए खाएं ये 4 शाकाहारी फूड, छोड़ देंगे मीट-मछली

Vegetarian Foods for Protein: सिर्फ जिम जाने वाले या बॉडी बनाने वाले लोगों को ही प्रोटीन की जरूरत नहीं होती है. बल्कि एक...

రోడ్ల దుస్థితిపై టీడీపీ వార్ .. చింతమనేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా, గద్దె రామ్మోహన్ అరెస్ట్

రామచంద్రాపురంలో గుంతలు పూడ్చే కార్యక్రమంలో చింతమనేని దెందులూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గుంతల మాయమైన రోడ్లను పూడుస్తూ తమ నిరసనను తెలియజేశారు. పెదవేగి మండలం...

రాష్ట్రపతి, ప్రధానికి ఫిర్యాదు చేశారు.. ఆ దొంగలు అంటూ రఘురామ..

రఘురామ కృష్ణరాజు మరోసారి ఫైరయ్యారు. వైసీపీ సర్కార్, సీఎం జగన్ లక్ష్యంగా మరోసారి విమర్శలు చేశారు. జగన్, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా కామెంట్ చేశారు. రఘురామ కృష్ణరాజు వర్సెస్ జగన్ సర్కార్ మధ్య...

పరకాలలో హైటెన్షన్-ప్రత్యేక జిల్లాకు పోరాటం ఉధృతం-ఎమ్మెల్యే ధర్మారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు

హన్మకొండ జిల్లాలోని పరకాలలో శనివారం(జులై 24) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పరకాల పట్టణాన్ని అమరవీరుల జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలన్న డిమాండుతో చేపట్టిన బంద్ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట...

Illegal affair: సిటీలో భర్త, ఇంట్లో మరిదితో భార్య మసాజ్, భర్త ఏంచేశాడంటే, తమ్ముడు మిస్ !

భర్తతో హ్యాపీలైఫ్ ఉత్తరప్రదేశ్ లోని బరాచ్ జిల్లాలోని కొట్వాలి నన్సారా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంజరియా గ్రామంలో రాజేష్ సింగ్, రీటా (32) దంపతులు నివాసం ఉంటున్నారు....

Stay Connected

98,675FansLike
224,586FollowersFollow
56,656SubscribersSubscribe