News
lekhaka-Bhusarapu Pavani
దేశంలో
తయారీ
రంగం,
పారిశ్రామిక
ఉత్పత్తికి
సంబంధించిన
డేటాను
కేంద్ర
గణాంకాల
శాఖ
విడుదల
చేసింది.
దాని
ప్రకారం,
ఇండియా
ఇండస్ట్రియల్
ప్రొడక్షన్
మార్చిలో
1.1
శాతం
వృద్ధి
సాధించింది.
గత
5
నెలల్లో
ఇదే
అతి
తక్కువ
కావడం
గమనార్హం.
ఫిబ్రవరిలో
వృద్ధి
5.6
శాతం
నుంచి
5.8కి
సవరించారు.
ప్రముఖ
వార్తా
సంస్థ
జరిపిన
సర్వేలో
పలువురు
ఆర్థికవేత్తలు
తమ
అభిప్రాయాలను
పంచుకున్నారు.
మార్చిలో
IIP
వృద్ధి
3.2
శాతానికి
తగ్గుతుందని
అంచనా
వేశారు.
అయితే
వాటిని
తలక్రిందులు
చేస్తూ
కేవలం
1.1
శాతం
వద్ద
స్థిరపడింది.
2021-22లో
11.4
శాతంగా
ఉన్న
పారిశ్రామిక
ఉత్పత్తి..
2022-23
ఏడాది
మొత్తానికి
5.1
శాతం
వృద్ధి
సాధించింది.

తయారీ
మరియు
విద్యుత్
విభాగాల
స్తబ్దత
కారణంగా
మార్చిలో
పారిశ్రామిక
వృద్ధి
గణనీయంగా
పడిపోయింది.
మాన్యుఫ్యాక్చరింగ్
రంగం
ప్రభావం
IIPలో
మూడు
వంతుల
కంటే
ఎక్కువ
వాటా
కలిగి
ఉంది.
ఫిబ్రవరిలో
5.6
శాతం
పెరుగుదల
నమోదుకాగా,
ఏడాది
ప్రాతిపదికన
కేవలం
0.5
శాతం
మాత్రమే
వృద్ధి
కనబరిచింది.
అయితే
ఫిబ్రవరిలో
విద్యుత్
ఉత్పత్తి
పెరుగుదల
8.2
శాతంతో
పోలిస్తే
1.6
శాతం
తగ్గింది.
సీక్వెన్షియల్
ప్రాతిపదికన
ఫిబ్రవరి
నుంచి
తయారీ
ఉత్పత్తి
6.4
శాతం
పెరగ్గా,
విద్యుత్
ఉత్పత్తి
8.0
శాతం
వృద్ధి
చెందింది.
ఇక
మూడవ
రంగం
మైనింగ్
విషయానికి
వస్తే
దాని
ఉత్పత్తి
సంవత్సరానికి
6.8
శాతం
మరియు
నెలవారీ
ప్రాతిపదికన
19.3
శాతం
పెరిగింది.
ప్రాథమిక
వస్తువుల
ఉత్పత్తిలో
వృద్ధి
ఫిబ్రవరిలో
6.9
నుంచి
3.3
శాతం
సగానికి
పైగా
తగ్గింది.
మార్చిలో
క్యాపిటల్
గూడ్స్
ఉత్పత్తి
గౌరవప్రదంగా
8.1
శాతం
ఎగబాకింది.
English summary
Industrial production growth slides 5 months low 1.1 Percent
Industrial production growth slides 5 months low 1.1Percent.
Story first published: Saturday, May 13, 2023, 8:08 [IST]