PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

5 రోజుల్లో రూ.1.87 లక్షల కోట్లు నష్టపోయిన టాప్‌ 10 కంపెనీలు

[ad_1]

Top 10 Companies:

దేశంలోనే అత్యంత విలువైన పది కంపెనీలు చివరి వారం సంయుక్తంగా రూ.1,87,808 కోట్ల మార్కెట్‌ విలువను నష్టపోయాయి. ఈక్విటీ మార్కెట్ల సరళి బలహీనంగా ఉండటంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు (HDFC Bank), రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (Reliance Industries) షేర్లు ఎక్కువ పతనమయ్యాయి.

గత వారం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 2.52 శాతం లేదా 1,538 పాయింట్ల మేర నష్టపోయింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లు పెంచుతుందన్న ఊహగానాలు, రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కొనసాగుతుండటం, మళ్లీ ధరలు పెరుగుతుండటం ప్రతికూల సెంటిమెంటును పెంచింది. విదేశీ సంస్థాగత మదుపర్లు స్థానిక మార్కెట్ల నుంచి డబ్బులను వెనక్కి తీసుకుంటున్నారు.

టాప్‌-10 కంపెనీల్లో ఐటీసీని మినహాయిస్తే అన్నీ నష్టపోయాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు రూ.37,848 కోట్లు నష్టపోయింది. దాంతో మార్కెట్‌ విలువ రూ.8,86,070 కోట్లుగా ఉంది. ఇక రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.36,567 కోట్ల మార్కెట్‌ విలువ కోల్పోయింది. రూ.16,14,109 కోట్లతో ఉంది. టీసీఎస్‌ రూ.36,444 కోట్లు నష్టపోయి రూ.12,44,095 కోట్ల వద్ద కొనసాగుతోంది. హెచ్‌డీఎఫ్‌సీ మార్కెట్‌ విలువ రూ.20,871 కోట్లు పతనమై రూ.4,71,365 కోట్లుగా ఉంది.

ఐసీఐసీఐ బ్యాంకు (ICICI Bank) మార్కెట్‌ క్యాప్‌ విలువ రూ.15,765 కోట్లు నష్టపోయి రూ.5,86,862 కోట్ల వద్ద ఉంది. సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రూ.13,465 కోట్లు పతనమైన రూ.6,52,862 కోట్ల వద్ద కొనసాగుతోంది. భారతీ ఎయిర్‌టెల్‌ మార్కెట్‌ విలువ రూ.10,792 కోట్లు తగ్గింది. రూ.4,22,034 కోట్లతో ఉంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా రూ.8,879 కోట్ల మార్కెట్‌ విలువ కోల్పోయి రూ.4,64,927 కోట్ల వద్ద ఉంది.

హిందుస్థాన్‌ యునీలివర్ మార్కెట్‌ విలువ రూ7,236 కోట్లు తగ్గి రూ.5,83,697 కోట్లుగా ఉంది. ఐటీసీ మాత్రం దుమ్మురేపింది. రూ.2,143 కోట్లు లాభపడి రూ.4,77,910 కోట్లతో కొనసాగుతోంది. అత్యంత విలువైన కంపెనీల్లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో ఉంది. టీసీఎస్‌, హెచ్డీఎఫ్‌సీ బ్యాంకు, ఇన్ఫోసిస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఐటీసీ, హెచ్డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, భారతీ ఎయిర్‌టెల్‌ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *