నందమూరి నటసింహం బాలయ్య నుంచి సినిమా వస్తుందంటే ఆడియన్స్ కచ్చితంగా ఊర మాస యాక్షన్.. బిగ్ బడా డైలాగ్స్.. హీరోయిన్స్‌తో హాట్ సాంగ్స్.. కచ్చితంగా ఎక్స్పెక్ట్ చేస్తారు. గత కొన్ని నెలల నుంచి బాలయ్య వీటిని బ్యాలెన్స్ చేస్తూ సినిమాల్లో నటిస్తూ సక్సెస్లు అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక జానపదం, పౌరాణికం, హిస్టారికల్, సాంగీకం, సైన్స్ ఫిక్షన్ ఇలా జానర్ ఏవైనా.. బాలయ్య అన్ని సినిమాలలో ఫైట్ సన్నివేశాలు, భారీ డైలాగులు మాత్రం కామన్ గానే వస్తూ ఉంటాయి. ఇక అఖండ నుంచి సక్సెస్ ట్రాక్ ఎక్కి ఫ్లాప్ లేకుండా దూసుకుపోతున్న బాలయ్య.. తన సినీ కెరీర్‌లో ఒక్క ఫైట్ కూడా లేకుండా.. ఓ సినిమాలో నటించాడు అన్న సంగతి చాలా మందికి తెలిసి ఉండదు.
పక్క కమర్షియల్ సినిమాలకు కెర్ఆఫ్ అడ్రస్‌గా నిలిచిన బాలయ్య.. తన ప్రతి సినిమాలోను.. ఆరు ఫైట్లు, ఆరు పాటలు తో కంప్లైంట్ ప్యాకేజీల సినిమాను సిద్ధం చేసుకునేవాడు. ఇప్పుడు ఫార్మేట్ కాస్త మారిన.. రెగ్యులర్ టెంప్లెట్ మాత్రం అదే ఫాలో అవుతున్నాడు. జోనర్ ఏదైనా సరే ఫైట్లు సాంగ్స్ కచ్చితంగా ఉండేలా చూసుకుంటున్నారు. అలాంటి బాలయ్య సినీ కెరీర్‌లో ఒక్క ఫైట్ కూడా లేని ఓ కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నటించారంటే నమ్మసక్యం కాకున్నా.. ఇదే వాస్తవం. ఇంతకీ అసలు ఫైట్లే లేకుండా బాలయ్య నటించిన ఆ సినిమా మారేదో కాదు.. నారీ నారీ నడుమ మురారి.
బాలయ్య సినీ కెరీర్‌లో 50వ సినిమాగా.. మైల్డ్ స్టోన్‌గా రూపొందిన ఈ సినిమాలో.. యాక్షన్ సీక్వెన్సెస్, ఫైట్స్, రక్తపాతం ఇలాంటివి లేకుండా ఫుల్ క్లాసికల్ మూవీ గా రూపొందించారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఇవేవీ లేకుండా బాలయ్య నటించిన సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచి.. రికార్డ్స్ సృష్టించడమే. కోదండరామిరెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో బాలయ్య జంటగా శోభన, నిరోష హీరోయిన్లుగా మెరిసారు. సీనియర్ నటి శారద, కైకాల సత్యనారాయణ కీలక పాత్రలు పోషించి మెప్పించారు. రొమాంటిక్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఈ సినిమా రూపొంది టాలీవుడ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అంతేకాదు.. బాలయ్య కెరీర్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే చాలా స్పెషల్స్ సినిమాగా నిలిచిపోయింది.