లక్షల ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపింది ఎవరు బాబు
టిడిపి నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన విజయసాయి రెడ్డి చంద్రబాబు ని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. నిజాం షుగర్స్, డజను సహకార చక్కెర కర్మాగారాలు, ఆల్విన్ వాచెస్, స్పిన్నింగ్ మిల్లులు , పేపర్ మిల్లులు మొత్తం 54 సంస్థలను అమ్మింది ఎవరు చంద్రం అంటూ విజయ సాయి రెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు. ఇంకా వంద సంస్థలు పెకిలించాలనుకున్నావు . లక్షల ఉద్యోగులకు వీఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించావు అంటూ విరుచుకుపడ్డారు.

ప్రైవేటీకరించవద్దని కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయడట తుక్కు బాబు
మీ ముసలి కన్నీరు, కొంగ జపాలు జనానికి తెలియవా బాబూ ? అంటూ విజయసాయి రెడ్డి సెటైర్లు వేశారు. ఇదే సమయంలో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో విశాఖ వచ్చి మరీ ముసలి కన్నీరు కార్చిన చంద్రబాబు ప్రైవేటీకరించవద్దని కేంద్రానికి కనీసం లేఖ కూడా రాయడట తుక్కు బాబు అంటూ మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను తెగ నమ్ముతూ, విదేశీ కంపెనీల మెప్పు కోసం లక్షలాది కార్మికుల పొట్ట కొట్టిన ఘనత చంద్రంది అంటూ విజయ సాయి రెడ్డి నిప్పులు చెరిగారు.

రేపు వైసీపీ నాయకుల స్టీల్ ప్లాంట్ పరిరక్షణా పోరాట యాత్ర
అంతేకాదు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం సీఎం వైయస్ జగన్ గారి నాయకత్వంలో ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఎనిమిదిన్నర గంటలకు విశాఖలో వైఎస్ఆర్సిపి నాయకులు స్టీల్ ప్లాంట్ పరిరక్షణా పోరాట యాత్ర జరుగుతుందని పేర్కొన్నారు. జీవీఎంసీ వద్దనున్న మహాత్మాగాంధీ విగ్రహం నుండి మొదలై వైజాగ్ స్టీల్ ప్లాంట్ వరకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణా పోరాట యాత్ర కొనసాగుతుందని, ఈ యాత్రకు సంబంధించిన పూర్తి రూట్ మ్యాప్ ను ట్విట్టర్లో పోస్ట్ చేశారు విజయ సాయి రెడ్డి.