నేడు భారత్ లో రికార్డులు బ్రేక్ చేస్తున్న బంగారం ధరలు

భారతదేశంలో నేడు బంగారం ధరల విషయానికి వస్తే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 55,300గా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఏకంగా 60,320 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల మీద ఏకంగా 1500 రూపాయలు ఆర్నమెంట్ గోల్డ్ మీద, 1630 రూపాయలు స్వచ్ఛమైన బంగారం మీద ధర పెరగడం ఒక్కసారిగా బంగారం కొనుగోలుదారులను ఆందోళనలో ముంచేసింది. ఈ ధరల దూకుడు ఇలాగే కొనసాగితే ఎలా అన్న ఆందోళనలకు కారణంగా మారింది.

హైదరాబాద్ లో భారీగా పెరిగిన బంగారం ధరలు ఇలా

హైదరాబాద్ లో భారీగా పెరిగిన బంగారం ధరలు ఇలా

హైదరాబాద్లో బంగారం ధరల విషయానికి వస్తే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం నేడు హైదరాబాద్లో 55,300గా ట్రేడ్ అవుతుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం హైదరాబాద్లో 60,320 కొనసాగుతుంది. నిన్న హైదరాబాద్ లో 22 క్యారెట్ల బంగారం ధర 53,800 కాగా, నేడు ఏకంగా 1500 రూపాయల మేర ధర పెరిగి 55300 రూపాయలకు చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న హైదరాబాద్లో 58 వేల 690 రూపాయలు కాగా నేడు 60,320 లకు ధర పెరిగింది. నేడు ఏకంగా 1630 రూపాయలు ధర పెరిగినట్లుగా తెలుస్తుంది.

ఢిల్లీ, ముంబై తో పాటు ఏపీలో బంగారం ధరలిలా

ఢిల్లీ, ముంబై తో పాటు ఏపీలో బంగారం ధరలిలా

ఇక దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధరల విషయానికి వస్తే ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,450 రూపాయలు కాగా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60 వేల 470 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,300 రూపాయలుగా ట్రేడ్ అవుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,470 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, గుంటూరులలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,300గా కొనసాగుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,320 రూపాయలుగా కొనసాగుతుంది.

బెంగళూరు, చెన్నై లలో బంగారం ధరలిలా

బెంగళూరు, చెన్నై లలో బంగారం ధరలిలా

బెంగళూరులో బంగారం ధర నేడు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారానికి 55,350గా ట్రేడ్ అవుతుంటే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,370 రూపాయలుగా కొనసాగుతుంది. ఇక చెన్నై, మధురై, కోయంబత్తూర్ లలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 55,600 రూపాయలుగా కొనసాగుతుంటే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,650 రూపాయలుగా కొనసాగుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *