News
lekhaka-Bogadi Adinarayana
aadhar: దేశంలో అతి ముఖ్యమైన ఐడెంటిటీ కార్డుల్లో ఒకటి ఆధార్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తప్పకుండా దీనిని వినియోగిస్తుంటారు. కొన్ని ప్రభుత్వ సేవలు పొందడానికైతే ఇది తప్పనిసరి. అంతటి ప్రాముఖ్యత ఉన్న ఆధార్ వెరిఫికేషన్ ఫెయిల్ అయితే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. అలా జరగకుండా ఉండాలంటే, ఎప్పటికప్పుడు అవసరాల మేరకు ఆధార్ కార్డు వివరాలు అప్ డేట్ చేసుకోవాలని UIDAI సూచించింది.
ఆధార్ కార్డు తీసుకుని పదేళ్లు అయిన వాళ్లకు UIDAI ఓ ముఖ్యమైన సూచన చేసింది. గత దశాబ్ద కాలంలో ఎప్పుడూ వివరాలు అప్ డేట్ చేయకపోతే వెంటనే ఆ పని పూర్తి చేయాలని తెలిపింది. ఆయా వ్యక్తుల గుర్తింపుతో పాటు చిరునామా రుజువులను ధృవీకరణ కోసం సమర్పించాలని పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్ ఫాం ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఇందుకు గాను ఆన్ లైన్ లో రూ.25, ఆఫ్ లైన్ లో రూ.50 చొప్పున రుసుము చెల్లించాల్సి ఉంటుందని వెల్లడించింది.

అప్ డేట్ చేసే సమయంలో మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని UIDAI సూచించింది. ప్రజల అవసరాన్ని వాళ్లు అవకాశంగా మలచుకునే అవకాశం ఉందని స్పష్టం చేసింది. దీనితో పాటు పాన్ ను సైతం ఆధార్ తో అనుసంధానం చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. మార్చి నెలాఖరు లోపు ఈ పని పూర్తి చేయాల్సి ఉంది. లేని పక్షంలో పాన్ వినియోగించేందుకు పనికిరాకుండా పోతుందని ఇప్పటికే ప్రకటించింది.
यदि आपका आधार दस साल पहले बना था और इसे अपडेट नहीं किया गया है, तो आपसे अनुरोध किया जाता है कि आप अपनी ‘पहचान के प्रमाण’ और ‘पते के प्रमाण’ के दस्तावेजों को अपलोड कर इसे फिर से सत्यापित करें।ऑनलाइन अपलोड करने का शुल्क 25 रुपये और ऑफलाइन के लिए 50 रुपये है@GoI_MeitY @mygovindia pic.twitter.com/y9LXZ3ipVQ
— Aadhaar (@UIDAI) February 20, 2023
English summary
UIDAI suggested to update ten years old aadhar details
UIDAI suggested to update ten years old aadhar details
Story first published: Wednesday, February 22, 2023, 22:49 [IST]