పెరిగిన అమ్మకాలు..

భారత ఐటీ కంపెనీలు ఉద్యోగులను నిలుపుకునేందుకు నానా తంటాలు పడుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో అట్రిషన్ రేటు 13 శాతానికి దిగివచ్చింది. అంతకు ముందు త్రైమాసికంలో ఇది 20 శాతంగా ఉంది. ప్రస్తుతం కంపెనీ కింద దాదాపు 737,719 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. తక్కువ అట్రిషన్ రేటు కంపెనీ లాభాల మార్జిన్లను పెంచుతుంది. ఈ సమయంలో కంపెనీ అమ్మకాలు సైతం 5 శాతం పెరిగి 15.7 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

తగ్గిన నియామకాలు..

తగ్గిన నియామకాలు..

అట్రిషన్ రేటు తగ్గటంతో కంపెనీ కొత్త ఉద్యోగుల నియమించుకోవాల్సిన అవసరం తగ్గింది. ఇది కంపెనీకి రిక్రూటింగ్ ఖర్చులను తగ్గించింది. ఐటి సిబ్బందికి వారి నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, కొత్త సామర్థ్యాల్లో పని చేయడానికి అవకాశాలు కల్పిస్తే ఉద్యోగుల టర్నోవర్‌ను తగ్గించవచ్చని యాక్సెంచర్ రుజువు చేసింది.

2023 తొలి త్రైమాసికంలో..

2023 తొలి త్రైమాసికంలో..

కొత్త సంవత్సరం మెుదటి త్రైమాసికంలో కంపెనీకి దాదాపుగా 160 బిలియన్ డాలర్ల విలువైన IT ప్రాజెక్ట్‌లు పునరుద్ధరించబడతాయి. అయితే ఈ సమయంలో సేవలతో సంతృప్తి చెందని వినియోగదారులు సాధారణంగా ఇతర కంపెనీలకు వాటిని అప్పగించే ప్రమాదం ఉంటుంది. ఇది ఉద్యోగుల తొలగింపుకు కారణమౌతుందని తెలుస్తోంది. ఈ క్రమంలో ద్రవ్యోల్బణం వల్ల ఏర్పడిన మాంద్యం ఉండంటంతో కంపెనీలు కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు పెట్టడానికి దూరంగా ఉంటాయని ఐటీ రంగం నిపుణులు చెబుతున్నారు.

ప్రాజెక్టులు కోల్పోతే..

ప్రాజెక్టులు కోల్పోతే..

ప్రధానంగా యూరోపియన్ దేశాలు వారి జీడీపీలో 60 శాతం అప్పులు కలిగి ఉన్నాయి. అందుకే అవి మాంద్యం వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. ఐటీ కంపెనీలకు ప్రధాన మార్కెట్లలో యూరప్ కూడా ఒకటిగా ఉన్నందున.. ఏవైనా కంపెనీలు భారీ సంఖ్యలో ప్రాజెక్టులను కోల్పోతే.. ఐటీ రంగంలో భారీగా తొలగింపులు తప్పవని తెలుస్తోంది. చాలా కంపెనీల్లోని ఉద్యోగులు సైతం ఇప్పుడు దీనిపైనే అధికంగా ఆందోళన చెందుతున్నారు.

ఐటీ కంపెనీల్లో అట్రిషన్..

ఐటీ కంపెనీల్లో అట్రిషన్..

సెప్టెంబర్ త్రైమాసికంలో భారత ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు భారీగానే ఉంది. ఈ క్రమంలో ఇన్ఫోసిస్ ఉద్యోగుల టర్నోవర్ రేటు 27.1 శాతం, విప్రో 23 శాతం, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 23.8 శాతం, టీసీఎస్ 21.5 శాతం, టెక్ మహీంద్రా 20 శాతం కలిగి ఉన్నాయి. ఇవి కంపెనీలు కోరుకుంటున్న దానికంటే ఎక్కువనే చెప్పుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *