[ad_1]
ధరలు సవరించాలి:
బొగ్గు ధరలో విభేదాల కారణంగా అదానీ పవర్ లిమిటెడ్‌తో కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని సవరించాలని బంగ్లాదేశ్ కోరినట్లు అక్కడి ప్రముఖ మీడియా సంస్థ తెలిపింది. “మా థర్మల్ పవర్ ప్లాంట్ల కోసం దిగుమతి చేసుకుంటున్న బొగ్గు రేటుతో పోలిస్తే.. అదానీ సంస్థ కోట్ చేసిన మొత్తం చాలా ఎక్కువ. మెట్రిక్ టన్నుకు 400 డాలర్లు వారు నిర్ణయించారు కానీ 250 డాలర్ల కంటే తక్కువ ఉండాలని మేం భావిస్తున్నాం. ఈ విషయంపై ఆ కంపెనీతో చర్చలు జరుపుతాం” అని బంగ్లాదేశ్ పవర్ డెవలప్ మెంట్ బోర్డు (BPDB) అధికారి చెప్పినట్లు పేర్కొంది.
భారత ప్రభుత్వానికి సంబంధం లేదు:
జార్ఖండ్‌లో ప్రారంభం కానున్న అదానీ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి 1,600MW విద్యుత్ సరఫరా కోసం BPDB దీర్ఘకాలిక కొనుగోలు ఒప్పందంపై 2018లో సంతకం చేసింది. బొగ్గు కోసం బంగ్లాదేశ్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉండగా.. కంపెనీ కోట్ చేసిన ధర చాలా ఎక్కువగా ఉందని, ధరపై మళ్లీ చర్చలు జరపాలని ఆ దేశం కోరుతోంది. అయితే సార్వభౌమ ప్రభుత్వం మరియు ప్రైవేట్ కంపెనీ మధ్య జరిగిన ఒప్పందంలో భారత ప్రభుత్వం ప్రమేయం ఉండదని విదేశాంగ శాఖ అధికారి అరిందమ్ బాగ్చీ స్పష్టం చేశారు.
అమెరికా సంస్థ అప్పుడే చెప్పింది..
బంగ్లాదేశ్ ప్రస్తుతం 1,160MW విద్యుత్ ను భారత్ నుంచి దిగుమతి చేసుకుంటోంది. 25 ఏళ్లపాటు మరో 1,600MW విద్యుత్ కొనుగోళ్ల కోసం 2018లో అదానీ గ్రూపుతో ఆ దేశం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఏడాది మార్చి నుంచి విద్యుత్‌ను దిగుమతి చేసుకోవడం ప్రారంభించాల్సి ఉంది. కాగా ఇప్పుడు బొగ్గు ధరపై విభేదాలు బయటపడ్డారు. అయితే.. USకు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ (IEEFA) తన 2018 నివేదికలో.. బంగ్లాదేశ్‌కు అదానీ ప్రాజెక్ట్ చాలా ఖరీదైనది మరియు ప్రమాదకరమని పేర్కోవడం విశేషం.
[ad_2]
Source link
Leave a Reply