News
lekhaka-Bhusarapu Pavani
adani:
అమెరికాకు
చెందిన
రీసెర్చ్
సంస్థ
హిండెన్
బర్గ్
వల్ల
అదానీ
గ్రూపునకు
జరిగిన
నష్టం
గురించి
అందరికీ
తెలిసిందే.
అనంతరం
జాక్
డోర్సేకు
చెందిన
బ్లాక్
సైతం
తీవ్ర
ఇబ్బందులు
ఎదుర్కోవాల్సి
వచ్చింది.
కాగా
2023లో
కొత్తగా
దాని
కన్ను
మరో
సంస్థపై
పడినట్లు
తెలుస్తోంది.
ఈ
మేరకు
ట్విట్టర్
వేదికగా
తన
నెక్స్ట్
టార్గెట్
గురించి
సమాచారం
ఇచ్చింది.
అదానీ
గ్రూపు
మరియు
జాక్
డోర్సే
యాజమాన్యంలోని
బ్లాక్
అనంతరం
2023లో
తమ
తాజా
లక్ష్యం
ఐకాన్
ఎంటర్
ప్రైజెస్
అని
పేర్కొంది.
ఇందులో
ప్రముఖ
పెట్టుబడిదారులు
కార్ల్
ఇకాన్
మెజారిటీ
వాటాను
కలిగి
ఉన్నారు.
అయితే
తన
పరిశోధనలో
IEP
యూనిట్ల
వాల్యుయేషన్
అన్యాయంగా
75
శాతానికి
పైగా
పెరిగిందని
హిండెన్
బర్గ్
ఆరోపించింది.
చివరిగా
నివేదించబడిన
నికర
ఆస్తి
విలువ
(NAV)తో
పోలిస్తే
IEP
218
శాతం
ప్రీమియంతో
ట్రేడ్
అవుతున్నట్లు
తెలిపింది.
ఇతర
పీర్స్
తో
పోలిస్తే
ఇది
చాలా
ఎక్కువని
స్పష్టం
చేసింది.

ఫ్లోరిడాలోని
సన్నీ
ఐల్స్
బీచ్
ప్రధాన
కేంద్రంగా
ఐకాన్
ఎంటర్
ప్రైజెస్
కార్యకలాపాలు
కొనసాగిస్తోంది.
ఇది
అత్యంత
విజయవంతమైన
పెట్టుబడి
సంస్థలలో
ఒకటి
మరియు
ఐకాన్
ప్రధాన
పెట్టుబడిదారు.
అనేక
ఉన్నత
స్థాయి
సంస్థలతో
డీల్స్
ద్వారా
ప్రసిద్ధి
చెందింది.
చివరి
ముగింపు
నాటికి
ఈ
ఏడాది
షేర్లు
కొంత
స్వల్పంగా
తగ్గాయి.
దీని
వాల్యుయేషన్
సుమారు
18
బిలియన్
డాలర్ల
ఉండవచ్చని
అంచనా.
బ్లాక్
మాజీ
ఉద్యోగులు
తాము
సమీక్షించిన
ఖాతాలలో
40
శాతం
నుండి
75
శాతం
వరకు
నకిలీవి,
మోసానికి
పాల్పడినవి
లేదా
అదనపు
ఖాతాలు
ఒకే
వ్యక్తితో
ముడిపడి
ఉన్నాయని
హిండెన్
బర్గ్
చెప్పింది.
గత
వారమే
ఆ
రీసెర్చ్
సంస్థ
ఆరోపణలు
గుప్పించగా
అనంతరం
ఈ
ప్రకటన
వెలువడింది.
బ్లాక్
లో
షార్ట్
పొజిషన్
తీసుకోవడమే
కాకుండా,
క్యాష్
యాప్
యూజర్
నంబర్‌లను
ఎక్కువగా
పేర్కొన్నట్లు
నివేదికలో
తెలిపింది.
వీటి
ఆధారంగా
కస్టమర్
ఆదాయ
ఖర్చులను
తక్కువ
చేసి
చూపినట్లు
ఆరోపించింది.
English summary
Hindenberg targeted Icahn Enterprises while taking short positions
Hindenberg targeted Icahn Enterprises while taking short positions
Story first published: Wednesday, May 3, 2023, 7:34 [IST]