[ad_1]
రేపు విచారణకు రానున్న PIL
అమెరికా సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదికపై కోర్టు పర్యవేక్షణలో విచారణ జరపాలని కోరుతూ.. సుప్రీంకోర్టులో న్యాయవాది విశాల్ తివారీ ప్రజాప్రయోజన వ్యాజ్యం(PIL) దాఖలు చేశారు. ఈ మేరకు అత్యవసరంగా విచారణ జరపాలని.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ఈరోజు ప్రస్తావించారు. ఇదే అంశంపై మరో ప్రత్యేక పిటిషన్ రేపు విచారణకు రానున్నట్లు చెప్పారు. దానితో కలిపి తన వ్యాజ్యంను సైతం విచారించాల్సిందిగా న్యాయస్థానాన్ని కోరారు. ఇందుకు న్యాయమూర్తి సరేనన్నారు.
భారత వృద్ధిపై జరిగిన దాడి
అదానీ గ్రూపు కంపెనీల్లో స్టాక్ మానిప్యులేషన్, అకౌంటింగ్ లో మోసాలు జరిగాయంటూ.. హిండెన్ బర్గ్ అనే రీసెర్చ్ సంస్థ గత నెలలో ఓ నివేదికను విడుదల చేసింది. ఈ ఆరోపణలు దేశ ప్రతిష్ఠను దిగజార్చాయని, తీవ్ర నష్టం కలిగించాయని విశాల్ తివారీ తన పిల్ లో పేర్కొన్నారు. ఇది ఓ నిర్దిష్ట కంపెనీపై మాత్రమే కాక.. భారత వృద్ధిపై కావాలని చేసిన దాడి అని అదానీ గ్రూపు సైతం తిప్పికొట్టినట్లు గుర్తు చేశారు.
ప్రత్యేక కమిటీ పర్యవేక్షణ అవసరం
బడా కార్పొరేట్ సంస్థలకు రూ.500 కోట్లకు పైగా ఇచ్చే రుణాల మంజూరు విధానాన్ని పర్యవేక్షించేందుకు.. ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీచేయాలని తన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో తివారీ కోరారు. ఏదైనా కారణాల వల్ల స్టాక్ మార్కెట్‌లో షేరు విలువ పడిపోతే.. ఆ ప్రభావం ప్రజలపై తీవ్రంగా పడుతోందని తెలిపారు. జీవితాంతం కష్టపడి కూడబెట్టిన డబ్బు గంగపాలు అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
స్పష్టమైన విధానం ఉండాలి
ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు చివరికి ప్రజాధనమే నష్టపోవాల్సి వస్తోందని న్యాయవాది గుర్తుచేశారు. అందుకే వారికి జవాబుదారిగా ఉన్న కేంద్రప్రభుత్వం, ఇతర సంస్థలు.. ఇటువంటి నష్టాలు పునరావృతం కాకుండా అడ్డుకోవడానికి ఓ స్పష్టమైన విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
పెద్ద మొత్తంలో రుణాలు మంజూరు చేసేముందు తీసుకోవాల్సిన చర్యలు, అనుసరించాల్సిన విధివిధానాల పట్ల కఠినంగా వ్యవహరించాలని సూచించారు. ఇదే అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(JPC)తో విచారణ జరిపించాలని ప్రతిపక్షాలు సైతం పెద్దఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో సుప్రీం కోర్టు స్పందన కోసం ప్రజలు వేచిచూస్తున్నారు.
[ad_2]
Source link
Leave a Reply