PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Adani: వాల్యూయేషన్ గురు షాకింగ్ కామెంట్స్.. అదానీ షేర్ల దూకుడు కారణం అదే..!

[ad_1]

హిండెన్ బెర్గ్ నివేదిక..

హిండెన్ బెర్గ్ నివేదిక..

అదానీ గ్రూప్ రుణాలపై హిండెన్ బెర్గ్ రిపోర్ట్ వెల్లడించిన వివరాలను ఆయన కొంత సమర్థించారు. నివేదిక ఆరోపించినట్లు అదానీ గ్రూప్ చెడ్డ వ్యాపార ఆచరణను కలిగి ఉందని అన్నారు. రిపోర్టు విరుద్ధంగా ఏమీ లేదంటూ అదానీ రుణాల వ్యవహారంలో స్పందించారు. అయితే ఈ రుణాలు కంపెనీకి ఉన్న అధిక పరపతిని ధృవీకరిస్తున్నాయని అన్నారు. అయినప్పటికీ అధిక రుణాలను తీసుకోవటం చెడ్డ వ్యాపార పద్ధతి అని దామోదరన్ తన బ్లాగ్‌లో రాశారు.

దామోదరన్ అంచనా..

దామోదరన్ అంచనా..

తన అంచనా ప్రకారం అదానీ ఎంటర్ ప్రైజెస్ చాలా ఎక్కువ రుణాన్ని కలిగి ఉందని దామోదరన్ చెప్పారు. అదానీ కంపెనీల్లో ఒకదాని వద్ద ఉన్న అధిక రుణాన్ని మరొకదాని వద్ద తక్కువ అప్పుతో భర్తీ చేయవచ్చని ప్రొఫెసర్ చెప్పారు. ఈ కంపెనీ రుణ భారాన్ని తగ్గించటం దాని వైఫల్య ప్రమాదాన్ని తగ్గించటమేనని అభిప్రాయపడ్డారు. అదానీ ఎంటర్ ప్రైజెస్ సరసమైన విలువ షేర్ ధర ఒక్కొక్కటి రూ.945గా ఉండాలని ఈ నెల ప్రారంభంలో తన బ్లాగ్ పోస్ట్‌లో రాశారు.

రాకెట్లా అదానీ ఎంటర్ ప్రైజెస్..

రాకెట్లా అదానీ ఎంటర్ ప్రైజెస్..

ఉదయం మార్కెట్ల ప్రారంభ సమయంలో అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ధర దాదాపు 7 శాతం మేర పతనమైంది. అయితే ఈ నష్టాల నుంచి దాదాపు 24 శాతం మేర స్టాక్ మధ్యానానికి లాభపడింది. ఈ క్రమంలో గ్రూప్ కు చెందిన ఇతర కంపెనీల షేర్ ధరలు సైతం పుంజుకున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పవర్, అదానీ పోర్ట్స్, అదానీ విల్మార్, ACC, అంబుజా సిమెంట్స్, NDTV కంపెనీల షేర్లు లాభపడ్డాయి. కేవలం అదానీ ట్రాన్స్ మిషన్, అదాన టోటల్ గ్యాస్ స్టాక్స్ మాత్రం నష్టాల్లో ముగిశాయి.

పరుగుల వెనుక కారణం..

పరుగుల వెనుక కారణం..

ఉదయం నష్టాల్లో ఉన్న కంపెనీ షేర్లు అనూహ్యంగా లాభాల్లోకి ఎందుకు వచ్చాయా అని చాలా మంది అనుకుంటున్నారు. దీని వెనుక ఒక కారణం ఉంది. 2023 మార్చి చివరి నాటికి 690 మిలియన్ డాలర్ల నుంచి 790 బిలియన్ డాలర్ల మధ్య విలువైన షేర్-బ్యాక్డ్ లోన్‌లను ముందుగా చెల్లించాలని గ్రూప్ చూస్తున్న రాయిటర్స్ వార్తా సంస్థ నివేదిక వెల్లడించింది. ఈ వార్త మార్కెట్లోకి రాగానే ఇన్వెస్టర్లలో ధైర్యం పెరిగింది. దీనికి ముందు కూడా అదానీ గ్రూప్ ముందస్తుగా రుణాల చెల్లింపును నిర్వహించింది.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *