[ad_1]
అదానీ ఎంటర్ ప్రైజెస్..
ఇటీవల ఎఫ్పీవోను వెనక్కి తీసుకున్న అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ ఈరోజు 20 శాతం మేర పెరిగి రూ.1,887.20 వద్ద ట్రేడవుతోంది. ఒక్కరోజే స్టాక్ ఏకంగా రూ.314.50 మేర లాభపడింది. దీంతో ఇన్వెస్టర్లు సంతోషంలో ఉన్నారు. ఇదే క్రమంలో అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ స్టాక్ 3.93 శాతం మేర లాభపడి రూ.924 వద్ద స్టాక్ ట్రేడవుతోంది. ఇదే క్రమంలో అదానీ పోర్ట్స్ స్టాక్ ఏకంగా 8.65 శాతం మేర పెరిగి రూ.590.20 వద్ద మార్కెట్లో ట్రేడవుతోంది. షేర్లు ఒక్కసారిగా తిరిగి కోలుకోవటంతో ఇన్వెస్టర్లు సైతం సంతోషంగా ఉన్నారు.
అదానీ పవర్..
ఈరోజు మార్కెట్ ట్రేడింగ్ సమయంలో అదానీ పవర్ స్టాక్ కేవలం 2.14 శాతం నష్టాల్లో కొనసాగుతూ రూ.178.20 వద్ద ట్రేడవుతోంది. ఇదే క్రమంలో అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ స్టాక్ 5 శాతం మేర నష్టపోయి రూ.1,464.20 వద్ద స్టాక్ ధర ఉంది.
5 శాతం లాభపడిన స్టాక్స్..
ఇదే క్రమంలో ఉదయం 11 గంటల సమయంలో అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ స్టాక్ 5 శాతం మేర లాభపడి రూ.1,319.25 వద్ద కొనసాగుతోంది. దీంతో స్టాక్ ధర ఒక్కసారిగా రూ.62.80 మేర పెరిగింది. ఇక కొత్తగా ఐపీవోగా మార్కెట్లోకి వచ్చి అదానీ విల్మర్ స్టాక్ నేడు 5 శాతం అప్పర్ సర్క్యూట్లో లాక్ అయ్యి రూ.18.95 మేర లాభపడింది. ఈ క్రమంలో స్టాక్ ధర ప్రస్తుతం రూ.398.90 వద్ద కొనసాగుతోంది.
సిమెంట్ మీడియా స్టాక్స్..
అదానీ ఇటీవల భారీ డీల్స్ ద్వారా సిమెంట్, మీడియా రంగాల్లోని కంపెనీలను హస్తగతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్డీటీవీ షేర్ ధర నేడు 3.98 శాతం మేర పెరిగటంతో స్టాక్ ధర రూ.224.85 వద్ద కొనసాగుతోంది. ఇక సిమెంట్ స్టాక్స్ విషయానికి వస్తే.. ఏసీసీ లిమిటెడ్ స్టాక్ నేడు 3.25 శాతం మేర లాభపడటంతో షేర్ ధర రూ.2,034.55 వద్ద మార్కెట్లో కొనసాగుతోంది. ఇదే సమయంలో అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ స్టాక్ సైతం లాభాల్లోనే ఉంది. అంబుజా స్టాక్ 4.29 శాతం మేర లాభపడటంతో స్టాక్ ధర రూ.395.50 వద్ద కొనసాగుతోంది. మెుత్తానికి దాదాపు రెండు వారాల తర్వాత అదానీ కంపెనీలు మార్కెట్లో తిరిగి లాభాల్లోకి వస్తున్నాయి. దీంతో ఇన్వెస్టర్లలో సైతం సంతోషం చిగురించిందని చెప్పుకోవాలి.
[ad_2]
Source link