[ad_1]
అదానీ ఎంటర్‌ప్రైజెస్..
అదానీ ఏదైనా ఒకసారి ఫిక్స్ అయితే వెనక్కి తగ్గరని చెప్పటానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. అదేంటంటే అదానీ ఎంటర్ ప్రైజెస్ మార్కెట్లోకి తెచ్చిన రూ.20,000 కోట్ల ఎఫ్పీఓలో ఎలాంటి మార్పులు ఉండవని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఇష్యూ ధర కంటే మార్కెట్ ధర చాలా తక్కువగా ఉంది. ఈ క్రమంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణిని అవలంభిస్తున్నట్లు మార్కెట్ వర్గాల ద్వారా తెలుస్తోంది.
గ్రూప్ నమ్మకం..
బ్యాంకర్లు, పెట్టుబడిదారులతో సహా తమ వాటాదారులందరికీ FPOపై పూర్తి విశ్వాసం ఉందని అదానీ ఎంటర్ ప్రైజెస్ ప్రకటించింది. FPO విజయంపై చాలా నమ్మకంగా ఉన్నట్లు వెల్లడించారు. FPO షెడ్యూల్, ప్రకటించిన ప్రైస్-బ్యాండ్ ప్రకారం జరుగుతుందని చెబుతూ.. షెడ్యూల్‌లో లేదా ఇష్యూ ధరలో ఎటువంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
ఎవరెవరు పాల్గొంటున్నారు..
విదేశాల నుంచి అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, బీఎన్‌పీ పారిబాస్ ఆర్బిట్రేజ్, సొసైటీ జనరల్, గోల్డ్‌మన్ సాక్స్ ఇన్వెస్ట్‌మెంట్ (మారిషస్) లిమిటెడ్, మోర్గాన్ స్టాన్లీ ఆసియా (సింగపూర్) పీటీఈ, నోమురా సింగపూర్ లిమిటెడ్, సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ మారిషస్ షేర్లను తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు. ఇక మనదేశానికి వస్తే.. ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ పెన్షన్ ఫండ్ యాంకర్ పుస్తకంలో పాల్గొన్నారు.
|
తెలంగాణ లీడర్స్..
అదానీ గ్రూప్ పై నివేదికతో స్టాక్ మార్కెట్లు కుప్పకూలటంతో పాటు ఎల్ఐసీ, ఎస్బీఐ వంటి సంస్థల పెట్టుబడులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడికీ కేంద్రం సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇదే విషయంపై మాట్లాడిని మంత్రి కేటీఆర్ అసలు అదానీ గ్రూప్ కంపెనీల్లో ఎల్ఐసీ, స్టేట్ బ్యాంక్ ఎందుకు పెట్టుబడులు పెట్టాయని సూటిగా ప్రశ్నించారు. అసలు ఈ పెట్టుబడి నిర్ణయాల వెనుక ఎవరున్నారంటూ ప్రశ్నించారు.
[ad_2]
Source link