Adani Group: యూపీఎ, ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో ఎదిగిన అదానీ.. ఎవరి హయాంలో ఎలాగంటే..

[ad_1]

రెండు దశాబ్ధాల కిందట..

రెండు దశాబ్ధాల కిందట..

దాదాపు 20 ఏళ్ల క్రితం అదానీ గ్రూప్ ఇప్పటితో పోల్చితే చాలా చిన్నది. అప్పట్లో ఎన్నడీఏ హయాంలోని భారత ప్రభుత్వం దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టింది. లిబరలైజేషన్, గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ ప్రణాళితో మన్మోహన్ సింగ్ రావటం ప్రైవేటు వ్యాపారులకు మంచి అవాకాశాలను అందించింది.

ఆ క్రమంలో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకున్న వారిలో గౌతమ్ అదానీ కూడా ఉన్నారు. మే 2004 నుంచి మే 2014 మధ్య కాలంలో అదానీ ఎంటర్ ప్రైజెస్ మంచి ర్యాలీని చూసింది. ఈ కాలంలో ఏకంగా 2,186 శాతం వృద్ధిని నమోదు చేసింది.

కాంగ్రెస్ ప్రభుత్వంలో..

కాంగ్రెస్ ప్రభుత్వంలో..

కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని పరిపాలిస్తున్న సమయంలో గౌతమ్ అదానీ మరిన్ని వ్యాపారాల్లోకి అడుగుపెట్టారు. అలా నవంబర్ 2007 సమయంలో అదానీ పోర్ట్స్ వ్యాపారంలోకి వచ్చారు. లిస్టింగ్ కి ముందు దీని పేరు ముంద్రా పోర్ట్ అని ఉండేది.

దీని తర్వాత 2009 సమయంలో అదానీ పవర్ కంపెనీని స్టాక్ మార్కెట్లోకి తీసుకొచ్చారు. అయితే 2014 నాటికి అదానీ పోర్ట్స్ స్టాక్ 18 శాతం పెరగగా.. పవర్ స్టాక్ మాత్రం 35 శాతం విలువ కోల్పోయింది. బీజేపీ అధికారంలోకి రావటానికి ముందు అదానీ మెుత్తం ఆస్తుల విలువ(మార్కెట్ క్యాప్) రూ.1.20 లక్షల కోట్లుగా ఉంది.

బీజేపీ హయాంలో..

బీజేపీ హయాంలో..

2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ తొలిసారి. అయితే బీజేపీ పాలిత ఎన్డీఏ ప్రభుత్వంలో అదానీ లిస్టెస్ కంపెనీల సంఖ్య మెుత్తంగా 10కి చేరుకుంది. ఈ క్రమంలో సిమెంట్, మీడియా, గ్రీన్ ఎనర్జీ, ట్రాన్స్ మిషన్, ఎఫ్ఎమ్సీజీ, గ్యాస్ వంటి రంగాల్లోకి అదానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.

అలా మోదీ సర్కార్ హయాంలో అదానీ ఆస్తులు 4500 శాతం మేర విలువ పెరిగాయి. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా.. జనవరి 24, 2023న అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ నివేదికతో అదానీ వ్యాపార సామ్రాజ్య కోటకు బీటలువారాయి.

ప్రస్తుతం కంపెనీల విలువ..

ప్రస్తుతం కంపెనీల విలువ..

ఫిబ్రవరి 8, 2023న అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ క్యాప్ రూ.2.46 లక్షల కోట్లుగా ఉంది. ఇదే క్రమంలో అదానీ టోటల్ గ్యాస్ రూ.1.53 లక్షల కోట్లు, అదానీ ట్రాన్స్‌మిషన్ రూ.1.47 లక్షల కోట్లు, అదానీ పోర్ట్స్ రూ.1.29 లక్షల కోట్లుగా ఉన్నాయి. వీటి తర్వాత గ్రీన్ ఎనర్జీ రూ.1.27 లక్షల కోట్లు, అంబుజా సిమెంట్స్ రూ.76,318 కోట్లు, అదానీ పవర్ రూ.70, 196 కోట్లు, అదానీ విల్మార్ రూ.54,502 కోట్లు, ఏసీసీ సిమెంట్స్ రూ.37,057 కోట్లు, ఎన్‌డీటీవీ రూ. 1,468 కోట్లు మార్కెట్ విలువను కలిగి ఉన్నాయి.

అయితే ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తానూ ఏ ఒక్క రాజకీయ పార్టీ సహకారంతో పైకి ఎదగలేదని చెప్పుకొచ్చారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *