[ad_1]
అదానీ ప్లాన్..
ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు అదానీ గ్రూప్ త్వరలోనే మార్కెట్లోకి 5 ఐపీవోలను తీసుకొచ్చే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. 2026 నుంచి 2028 మధ్య కాలంలో అదానీ ఏకంగా 5 కంపెనీలను మార్కెట్లో ఫ్లోట్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. గ్రూప్ కంపెనీలపై ఉన్న రుణ భారాన్ని తగ్గించుకునేందుకు, ఇన్వెస్టర్ల సంఖ్యను పెంచుకునేందుకు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏఏ కంపెనీలంటే..
అదానీ గ్రూప్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జుగ్షీందర్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో ఐపీవోలకు సంబంధించిన వివరాలను తెలిపారు. అదానీ గ్రూప్ ఇండస్ట్రీస్, అదానీ ఎయిర్‌పోర్ట్ హోల్డింగ్స్, అదానీ రోడ్ ట్రాన్స్‌పోర్ట్, అదానీ కనెక్స్‌తో పాటు గ్రూప్‌లోని మెటల్, మైనింగ్ యూనిట్లు వేర్వేరు కంపెనీలుగా లిస్ట్ చేయాలన్నది గ్రూప్ ఆలోచనగా తెలిపారు.
ఎయిర్ పోర్ట్స్..
విమానాశ్రయాల ఆపరేటింగ్ వంటి వ్యాపారాలు దాదాపు 300 మిలియన్ల కస్టమర్లకు సేవలందిస్తున్న కస్టమర్ ప్లాట్‌ఫారమ్‌లని సింగ్ వెల్లడించారు. వృద్ధి కోసం వారు తమ స్వంత మూలధన అవసరాన్ని స్వీయ నిర్వహణ చేసుకోవాల్సి ఉంటుంది. అధికారిక విభజనకు ముందు స్వతంత్ర పనితీరు, పాలన, మూలధన నిర్వహణ ప్రాథమిక పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగలవని నిరూపించుకోవాల్సి ఉంటుందని సింగ్ స్పష్టం చేశారు.
ఉత్తమ పనితీరు..
విమానాశ్రయ వ్యాపారం ఇప్పటికే స్వతంత్రంగా ఉంది. గ్రీన్ ఎనర్జీ దిశగా అదానీ న్యూ ఇండస్ట్రీస్ మరింత బలపడుతోంది. అదానీ రోడ్ కొత్త బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ మోడల్‌ను దేశానికి చూపుతోంది. ఈ క్రమంలో డేటా సెంటర్ వ్యాపారం పెరుగుతోంది. మెటల్ & మైనింగ్ వ్యాపారం గ్రూప్ కు చెందిన అల్యూమినియం, రాగి మైనింగ్ సేవలను కవర్ చేస్తోందని సింగ్ చెప్పుకొచ్చారు. అందుకే ఐదు యూనిట్ల స్కేల్ చాలా బాగుందని వెల్లడించారు.
అదానీ ఎంటర్‌ప్రైజెస్ FPO..
అదానీ గ్రూప్ త్వరలోనే దేశంలో అతిపెద్ద రికార్డుకు తెరలేపుతోంది. ఫాలో ఆన్ ఆఫర్ ద్వారా అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ల నుంచి 2.5 బిలియన్ డాలర్లను సేకరిస్తోంది. ఈ క్రమంలో అదానీ ఎంటర్‌ప్రైజెస్ స్టాక్ 2022లో దాదాపు 130 శాతం పెరిగింది. ఈ ఏడాది ఇప్పటి వరకు షేర్ దాదాపు 7 శాతం క్షీణించింది. అయితే మార్కెట్లో చాలా మంది కంపెనీ ఓవర్ వాల్యుయేషన్ గురించి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
[ad_2]
Source link