News
oi-Mamidi Ayyappa
Adani Group: బిలియనీర్ గౌతమ్ అదానీ నేతృత్వంలోని సమ్మేళనం గుజరాత్‌లోని ముంద్రాలో రూ.34,900 కోట్ల పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ పనులను నిలిపివేసింది. అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ రిపోర్ట్ ఇవ్వటంతో ఇన్వెస్టర్ల సమస్యలను పరిష్కరించడానికి వనరులపై దృష్టి సారించింది.
గ్రూప్ ఫ్లాగ్‌షిప్ అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ 2021లో గుజరాత్‌లోని కచ్ జిల్లాలో అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్(APSEZ) ల్యాండ్‌లో గ్రీన్‌ఫీల్డ్ కోల్-టు-పీవీసీ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి పూర్తి యాజమాన్యంలోని అనుబంధ సంస్థ ముంద్రా పెట్రోకెమ్ లిమిటెడ్‌ను కలిగి ఉంది. యాపిల్స్-టు-ఎయిర్‌పోర్ట్ గ్రూప్ పెట్టుబడిదారులను శాంతింపజేయాలని చూస్తోంది.

అందుబాటులో ఉన్న నగదు ప్రవాహం, ఫైనాన్స్ ఆధారంగా ప్రాజెక్టులను తిరిగి మూల్యాంకనం చేస్తున్నారు. ఒక మిలియన్ టన్నుల గ్రీన్ పీవీసీ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి కొనసాగించకూడదని అదానీ గ్రూప్ నిర్ణయించుకుంటున్నట్లు అంతర్గత వర్గాల ద్వారా వెల్లడైంది. ముంద్రా పెట్రోకెమ్ లిమిటెడ్ గ్రీన్ PVC ప్రాజెక్ట్ కోసం “తదుపరి నోటీసు వచ్చేవరకు” అన్ని కార్యకలాపాలను నిలిపివేయమని తెలిపినట్లు సమాచారం.
అదానీ గ్రూప్ తన రుణాల భారాన్ని తగ్గించుకోవటంతో పాటు, భవిష్యత్తు నగదు ప్రవాహాలు, ఫైనాన్సింగ్ ఆధారంగా కొన్ని ప్రాజెక్టులను కొనసాగించాలా లేక నిలిపివేయాలా అనే మూల్యాంకనం చేస్తోంది. అయితే ప్రస్తుతానికి కంపెనీ బ్యాలెన్స్ షీట్ చాలా బలంగా ఉందని కంపెనీ అధికారి వెల్లడించారు. పాలీ-వినైల్-క్లోరైడ్ (PVC) ఉత్పత్తి సామర్థ్యం 2,000 KTPA (కిలో టన్ను పర్ ఏడాది) ఉంది. దీని కోసం ఆస్ట్రేలియా, రష్యాతో పాటు ఇతర దేశాల నుంచి ఏడాదికి 3.1 మిలియన్ టన్నుల బొద్దు దిగుమతి చేసుకోవటం అవరసమని తెలుస్తోంది.
English summary
Adani group suspends mundra petro chemicals project worth 34900 crores
Adani group suspends mundra petro chemicals project worth 34900 crores
Story first published: Sunday, March 19, 2023, 15:09 [IST]