PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Adani-Modi: మోదీ అండతో అదానీ ఎదుగుతున్నారా..? క్లారిటీ ఇచ్చిన గౌతమ్ అదానీ.. రాజీవ్ గాంధీ పాత్ర

[ad_1]

రాజకీయ ఆరోపణలు..

రాజకీయ ఆరోపణలు..

జాతీయ రాజకీయాల్లో సహజంగా వినిపించే ఆరోపణ మోదీ సర్కార్ అదానీ, అంబానీలకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటోంది. దేశ అభివృద్ధి అంటే మోదీకి అదానీ అభివృద్ధి అంటూ ఘాటైన విమర్శలు వింటుంటాం. అదానీ ప్రధాని నరేంద్ర మోదీకి ఎంత సన్నిహితుడు? వీరి విజయానికి మోదీకి సంబంధం ఏమిటి? అనే అనేక ఆసక్తికర ప్రశ్నలకు అదానీ ఏమని బదులిచ్చారంటే..

ఇంటర్వ్యూ..

ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థకు అదానీ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ప్రధాని మోదీ, తాను ఒకే రాష్ట్రానికి చెందినవారు కావటంతోనే తనపై రకరకాల ఆరోపణలు చేస్తున్నారని అదానీ బదులిచ్చారు. తన వ్యాపార ప్రయాణాన్ని నాలుగు భాగాలని చెప్పుకొచ్చారు. ముందుగా తన ప్రయాణం రాజీవ్ గాంధీ హయాంలోనే ప్రారంభమైందని అన్నారు. చాలా మంది ఇది విని ఆశ్చర్యపోయినప్పటికీ వాస్తవం అదేనన్నారు. వ్యాపార సరళీకరణ విధానాన్ని రాజీవ్ గాంధీ అమలు చేశారని వెల్లడించారు. అవి తన ఉత్పత్తుల ఎగుమతిని పెంచటానికి దోహదపడ్డాయని పేర్కొన్నారు.

ప్రధాని నరసింహారావు..

ప్రధాని నరసింహారావు..

రెండో దశ వ్యాపార ప్రయాణం ప్రధానమంత్రి నరసింహారావు హయాంలో ప్రారంభమైందని అదానీ వెల్లడించారు. 1991 సంస్కరణల వల్ల తన వ్యాపారం లాభదాయకంగా ముందుకెళ్లిందని చెప్పారు. ఇక మూడో విడత వ్యాపారంలో మలుపు 1995లో వచ్చిందని అన్నారు. అప్పుడు కేశుభాయ్ పటేల్ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యారని.. సముద్ర తీరాల అభివృద్ధిపై ఆయన దృష్టి సారించారని చెప్పారు. ఆ కాలంలో ముంద్రా పోర్టు ఏర్పాటుకు సహాయపడిందని స్పష్టం చేశారు.

మోదీతో సంబంధం ఏంటి..?

మోదీతో సంబంధం ఏంటి..?

ఈ క్రమంలో గౌతమ్ అదానీ మోదీతో తనకు ఉన్న సంబంధాలపై కూడా స్పందించారు. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అభివృద్ధి పనులకు పెద్దపీట వేశారని వెల్లడించారు. ఆర్థిక, సామాజిక సంస్కరణల కోసం చాలా పథకాలను తెచ్చారని వెల్లడించారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న నేటికీ పరిస్థితి అలాగే ఉందని కొనియాడారు. తనపై చేస్తున్న ఆరోపణలు, ప్రచారాలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. తాను ఏ ఒక్క నాయకుడి వల్లా విజయం సాధించలేదని.. మూడు దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాల సహాయంతోనే విజయవంతమైన వ్యాపారవేత్తగా కొనసాగుతున్నానని అదానీ వెల్లడించారు.

ప్రధానిపై ప్రశంసలు..

ప్రధానిపై ప్రశంసలు..

నరేంద్ర మోదీలో దేశవృద్ధి కోసం దూరదృష్టి కలిగిన స్ఫూర్తిదాయకమైన నాయకత్వంతో ముందుకెళ్తున్నారని అన్నారని అదానీ అన్నారు. మోదీ కేవలం విధాన మార్పులు మాత్రమే చేయలేదని.. మాన్య భారతీయుడి జీవితంలో మార్పు తెచ్చే పథకాలను కూడా తెచ్చారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థనే కాకుండా దేశ సామాజిక స్థితిగతులను కూడా మార్చేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని అదానీ అన్నారు. సామాజిక, వ్యవసాయ, ఆర్థిక, అభివృద్ధి చెందని రంగాల అభివృద్ధిపై మోదీ దృష్టి సారించారని కొనియాడారు.

[ad_2]

Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *