[ad_1]
ఖండించిన గ్రూప్..
తమను సంప్రది వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేయకుండా అమెరికా సంస్థ రిపోర్టు విడుదల చేసిందని అదానీ గ్రూప్ వెల్లడించింది. ఎలాంటి ఆధారాలు లేని తప్పుడు ఆరోపణలను వక్రీకరిస్తూ, దురుద్ధేశంతో ఇచ్చిన రిపోర్టుగా కంపెనీ దీనిని కొట్టిపాడేశింది. కంపెనీ తీసుకొస్తున్న రూ.20 వేల కోట్ల ఎఫ్పీవోను టార్గెట్ చేసి ఈ రిపోర్ట్ రిలీజ్ చేసినట్లు గ్రూప్ పేర్కొంది.
లీగల్ యాక్షన్..
అదానీ షేర్ల పతనం నుంచి హిండెన్‌బర్గ్ ప్రయోజనం పొందుతుందని అదానీ గ్రూప్ ఆరోపించింది. అందుకే ఈ రీసెర్చ్ సంస్థపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు ముందుకు సాగుతోంది. దేశీయ మార్కెట్లలో అస్థిరతను సృష్టించి షార్ట్ సెల్ చేయటం ద్వారా హిండెన్‌బర్గ్ లాభపడుతుందని అదానీ గ్రూప్ హెడ్ – లీగల్ జతిన్ జలంధ్వాలా ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే దీనిపై చట్టపరమైన చర్యలను పరిశీలిస్తున్నట్లు గ్రూప్ పేర్కొంది.
షార్ట్ సెల్లింగ్ ఏంటి..?
హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన గేమ్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తోంది. సీజన్డ్ షార్ట్ సెల్లర్ భారత వ్యాపార దిగ్గజాల్లో ఒకటైన అదానీ గ్రూప్ కంపెనీ షేర్లను టార్గెట్ చేసింది. దీనివల్ల మెుదటిరోజు అంటే జనవరి 25న అదానీ గ్రూప్ కంపెనీలు 1-8 శాతం మధ్య నష్టపోయాయి. అమెరికా మార్కెట్లలో సైతం ఇలాంటివి చోటుచేసుకుంటూనే ఉంటాయి. ఫోరెన్సిక్ షార్ట్ సెల్లర్లు అన్ని వేళలా సరైనవారు కాదు. రెండో విషయానికి వస్తే వారు సరిగ్గా ఉన్నప్పుడు, మోసపూరిత కంపెనీలను గుర్తించిన వారిలో ముందు వరుసలో ఉంటారు.
రూ.97,000 కోట్లు ఆవిరి..
ఇంత భారీగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ కు చెందిన అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, అదానీ విల్మార్ షేర్లు భారీగా నష్టపోయాయి. ఈ క్రమంలో మెుత్తం గ్రూప్ కంపెనీలు దాదాపు రూ.97,000 కోట్లు కోల్పోయాయి. దీంతో చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా నష్టాలను చవిచూశారు.
[ad_2]
Source link
Leave a Reply