మార్కెట్ విలువ ఫసక్..

తాజాగా అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్ షేర్లు అత్యంత విలువైన జాబితా నుంచి నిష్క్రమించాయి. దీంతో అదానీ గ్రూప్ మెుత్తం మార్కెట్ క్యాప్ HDFC బ్యాంక్ మార్కెట్ విలువ కంటే తక్కువకు పడిపోయింది. దాదాపు 10 కంపెనీలు కలిగి ఉన్న గౌతమ్ అదానీ మార్కెట్ విలువ ఏకంగా ఒక్క బ్యాంక్ కంటే తక్కువ స్థాయికి చేరుకుంది.

 మార్కెట్ ర్యాంక్స్..

మార్కెట్ ర్యాంక్స్..

96,657 కోట్ల మార్కెట్ క్యాప్‌తో అదానీ టోటల్ గ్యాస్ 49వ స్థానంలో నిలిచింది. అదానీ ట్రాన్స్‌మిషన్ రూ.92,613.78 కోట్ల విలువతో 53వ స్థానానికి, అదానీ గ్రీన్ రూ.89,917.60 కోట్ల విలువతో 54వ స్థానంలో నిలిచింది. రూ.1,78,798 కోట్ల మార్కెట్ విలువతో అదానీ ఎంటర్‌ప్రైజెస్ BSEలో 27వ అత్యంత విలువైన స్టాక్‌గా నిలిచింది. అదానీ పోర్ట్స్ & సెజ్ రూ.1,26,001 కోట్లతో 37వ స్థానంలో ఉంది. దీంతో మెుత్తంగా అదానీ కంపెనీల పతనం వల్ల దాదాపు 62 శాతం మార్కెట్ విలువను కోల్పోయాయి.

SEBI దర్యాప్తు..

SEBI దర్యాప్తు..

అదానీ కంపెనీల విషయంలో పారదర్శకంగా దర్యాప్తు జరిపి అసలు ఏం జరుగుతుందనే వాస్తవాలను దేశ ప్రజల ముందు ఉంచాలని రాజకీయ ఒత్తిళ్లు బీజేపీ ప్రభుత్వంపై పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్పీడు పెంచిన మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీ తాజాగా అదానీ కంపెనీల రుణాలు, సెక్యూరిటీల రేటింగ్‌ వివరాలు అందించాలని కోరింది. అన్ని అత్యుత్తమ రేటింగ్‌లు, ఔట్‌లుక్ అండ్ బిజినెస్ గ్రూప్‌లోని అధికారులతో జరిపే చర్యల అప్‌డేట్‌ల సమాచారాన్ని పంచుకోవాలని స్పష్టం చేసింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *