నష్టాల్లో అదానీ షేర్స్..

హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక పెను సంచలనానికి దారితీసింది. దీంతో బిలియనీర్ అదానీకి చెందిన కంపెనీల షేర్లు రెడ్ జోన్‌లో ట్రేడ్ అవుతున్నాయి. పైగా ఇన్వెస్టర్లకు చెందిన వేల కోట్ల సంపద ఆవిరైంది. ఈ వ్యవహారంలో రెండేళ్లుగా ఫోరెన్సిక్ ఫైనాన్షియల్ రీసెర్చ్ సంస్థ తన విచారణను నిర్వహిస్తోంది.

నివేదిక ప్రకారం..

నివేదిక ప్రకారం..

హిండెన్‌బర్గ్ ప్రకారం అదానీ గ్రూప్ వ్యవస్థాపకుడు, చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ సుమారు 120 బిలియన్లు డాలర్లని తెలుస్తోంది. పైగా గడచిన మూడేళ్ల కాలంలో కుబేరుడి సంపద ఏకంగా 100 బిలియన్ డాలర్లకు పైగా పెరిగిందని నివేదిక తెలిపింది. ప్రధానంగా గ్రూప్ లోని లిస్టెడ్ కంపెనీ షేర్ ధరలు పెరుగుదల అదానీ సంపదను పెంచింది. కంపెనీల షేర్లు సగటున 819 శాతం లాభపడ్డాయి.

అధిక వాల్యుయేషన్..

అధిక వాల్యుయేషన్..

అదానీ గ్రూప్ వాస్తవ పరిస్థితులను లెక్కగట్టేందుకు రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా అనేక మంది వ్యక్తులు పరిశోధన కోసం ఇంటర్వ్యూ చేసింది. కంపెనీకి చెందిన అనేక డాక్యుమెంట్లను పరిశీలించింది. వీటిని పక్కనపెట్టి గ్రూప్ ఆర్థిక స్థితిని ఫేస్ వ్యాల్యూతో తీసుకున్నప్పటికీ.. ఏడు కీలకమైన లిస్టెడ్ కంపెనీలు 85% నష్టాలను కలిగి ఉన్నాయి. కంపెనీల వాల్యూయేషన్ సైతం ఆకాశానికి తాకినట్లు అభిప్రాయపడింది.

భారీగా రుణాలు..

భారీగా రుణాలు..

కీలకమైన లిస్టెడ్ అదానీ కంపెనీలు కూడా భారీగా రుణాలను పొందాయి. రుణాల కోసం కంపెనీ తన వాటాలను పెట్టడం గ్రూప్ ఆర్థిక పరిస్థితిని ప్రమాదంలో పడేసినట్లు నివేదిక వెల్లడించింది. అదానీ గ్రూప్ మనీలాండరింగ్, డాలర్లపై పన్ను దొంగతనంతో పాటు అవినీతి ఆరోపణలకు భారీగా డబ్బు వెచ్చించినట్లు చెప్పబడింది. మారిషస్, యూఏఈ, కరేబియన్ దీవులు వంటి టాక్స్ హెవెన్ ప్రాంతాల్లో షెల్ కంపెనీలను ఏర్పాటు చేసేందుకు అదానీ కుటుంబ సభ్యులు సహకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనికి తోడు నకిలీ దిగుమతి/ఎగుమతి డాక్యుమెంటేషన్‌, నకిలీ టర్నోవర్, కంపెనీల నుంచి డబ్బు దారి మళ్లించటం గురించి హిండెన్‌బర్గ్ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది.

నష్టాల్లో స్టాక్స్..

నష్టాల్లో స్టాక్స్..

ఇంత భారీగా ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అదానీ గ్రూప్ కు చెందిన అదానీ టోటల్ గ్యాస్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనామిక్ జోన్, అదానీ పవర్, అదానీ విల్మార్ షేర్లు 1-4 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఏడు అదానీ గ్రూప్ కంపెనీలు బుధవారం ఏకంగా రూ.46,086 కోట్ల మార్కెట్ క్యాప్ ను కోల్పోయాయి. అదానీ టోటల్ గ్యాస్ రూ.12,366 కోట్లు, అదానీ పోర్ట్స్ రూ.8,342 కోట్లు, అదానీ ట్రాన్స్‌మిషన్ రూ.8,039 కోట్ల మేర బుధవారం ట్రేడింగ్ లో నష్టపోయాయి.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *