[ad_1]
ఎయిర్ ఇండియా..
టాటాల యాజమాన్యంలోని ఎయిర్ ఇండియా తన వ్యాపారాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా తాజాగా FLYAI SALE పేరుతో డిస్కౌంట్ రేట్లకు విమాన టిక్కెట్లను విక్రయిస్తోంది. 2023 ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు దేశీయ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వారికి ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంది. అయితే ఈ ఆఫర్ కింద కేవలం పరిమిత సీట్లు మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.
ఆఫర్ చెల్లుబాటు..
ఈ ఆఫర్ కింద టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు జనవరి 23 వరకు మాత్రమే ఉంటుందని కంపెనీ ఇచ్చిన ప్రకటన ప్రకారం తెలుస్తోంది. ఎయిర్‌లైన్ ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెంట్లతో సహా అన్ని ఎయిర్ ఇండియా బుకింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో అమ్మకానికి టిక్కెట్లు అందుబాటులో ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇవి దేశీయ ప్రయాణాలకు సంబంధించిన రూట్లలో మాత్రమే అందుబాటులో ఉంటాయని తెలిపింది.
టిక్కెట్ ప్రారంభ ధర..
ఆఫర్ కింద వన్-వే టిక్కెట్ ధర అత్యల్పంగా రూ.1,705 నుంచి ప్రారంభమౌతోంది. అలా దేశంలోని 49 గమ్యస్థానాలకు ఈ తగ్గింపులు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. టాటాల చేతికి ఎయిర్ ఇండియా వచ్చిన తర్వాత సర్వీసులను మెరుగుపరచటమే కాక.. సేవల్లో నాణ్యతను సైతం పెంచేపనిలో ఎయిర్ ఇండియా నిమగ్నమై ఉంది. ఇందుకోసం కంపెనీ భారీగా కొత్త జెట్ విమానాలను సైతం కొనుగోలు చేసేందుకు ఆర్డర్ చేసింది.
టిక్కెట్ల ధరలు ఇలా..
ఢిల్లీ – ముంబై రూ. 5,075, చెన్నై – ఢిల్లీ రూ. 5,895, బెంగళూరు – ముంబై రూ. 2,319, ఢిల్లీ – ఉదయపూర్ రూ. 3,680, ఢిల్లీ – గోవా రూ. 5,656, ఢిల్లీ – పోర్ట్ బ్లెయిర్ రూ. 8,690, ఢిల్లీ – శ్రీనగర్ రూ. 3,730, అహ్మదాబాద్ – ముంబై రూ. 1,806, గోవా – ముంబై రూ. 2,830, దిమాపూర్ – గౌహతి రూ. 1,783గా టిక్కెట్ల ధరలు ప్రస్తుతం ఉన్నాయి. ఇది డొమెస్టిక్ ప్రయాణాలు చేసేవారికి నిజంగా పెద్ద అవకాశం అని చెప్పుకోవాలి. అయితే ఈ ఆఫర్లు ఎకానమీ క్లాస్ టిక్కెట్ల బుక్కింగ్ పై మాత్రమే అందుబాటులో ఉన్నట్లు ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది.
[ad_2]
Source link
Leave a Reply