వికృతంగా ప్రవర్తన..

మద్యం మత్తులో ఉన్న సదరు వ్యక్తి ఒక మహిళ బట్టలు, బూట్లు, బ్యాగ్ మూత్రంలో తడిసేలా చేయటంతో ఆమె సిబ్బందికి ఫిర్యాదు చేసింది. దీనిపై ఆమె ఎయిర్ ఇండియా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్‌కు లేఖ రాసింది. దీనిపై స్పందించిన డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భాద్యులపై తప్పక చర్యలు తీసుకుంటామని చెప్పింది.

అసలు ఏం జరిగింది..అసలు ఏం జరిగింది..

అసలు ఏం జరిగింది..అసలు ఏం జరిగింది..

నవంబర్ 26న న్యూయార్క్ నుంచి దిల్లీకి ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భోజనం తర్వాత లైట్లు డిమ్ అయ్యాయి. ఆ తర్వాత బిజినెస్ క్లాస్ లో ప్రయాణిస్తున్న 70 ఏళ్ల వ్యక్తి సహ ప్రయాణికురాలిపై జిప్ తీసి మూత్ర విసర్జన చేసింది. వేరే సీటు అందుబైటులో లేనందున సిబ్బందికి మహిళ ఫిర్యాదు చేసింది. పైగా ఫ్లైట్ దిల్లీలో ల్యాండ్ అయిన తర్వాత అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోకువటంతో ఆమె చంద్రశేఖరన్‌కి లేఖ రాసింది.

భయానకంగా ప్రయాణం..

ఎయిర్ ఇండియాకు చెందిన AI102 విమానంలో ఈ భయానక, అసభ్యకమైన ఘటన చోటుచేసుకుంది. తన బిజినెస్ క్లాస్ ట్రిప్‌లో జరిగిన భయంకరమైన సంఘటన గురించి ఆమె తన తీవ్ర నిరుత్సాహాన్ని లేఖలో వెల్లడించింది. భోజనం తర్వాత లైట్లు ఆపగా నిద్రకు ఉపక్రమిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిందని ఆమె అందులో వివరించింది. తన పక్కన ఉన్న మరో ప్రయాణికుడు సదరు వ్యక్తిని తిరిగి తన సీటుకు వెళ్లాలని సూచించినప్పటికీ కొంత సేపు అతడు స్పందించలేదని ఆమె తన లేఖలో వెల్లడించింది. ఈ లేఖ తర్వాత ఎయిర్ ఇండియా పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు వ్యక్తిని ‘నో-ఫ్లై లిస్ట్’లో చేర్చాలని ఎయిర్ ఇండియా అంతర్గత కమిటీ సిఫార్సు చేసింది.

సిబ్బంది సహకారంతో..

సిబ్బంది సహకారంతో..

ఈ ఘటన జరిగినప్పుడు ఇబ్బందిని ఎదుర్కొన్న ప్రయాణికురాలు వెంటనే ఫ్లైట్ సిబ్బందిని సంప్రదించింది. దీంతో సిబ్బంది వారి సీటును ఆమెకు ఇచ్చారు. గంట తర్వాత ఆమెను తిరిగి సీటుకు వెళ్లాలని సిబ్బంది కోరారు. అప్పటికీ సదరు సీటుపై కొన్ని షీట్లను కప్పారు. కానీ అప్పటికీ మూత్రం వాసన రావటంతో ఆమె నిరాకరించింది. దీంతో చేసేది లేక సిబ్బందికి సంబంధించిన మరో సీటులో ఆమె మిగిలిన 5 గంటల ప్రయాణాన్ని కొనసాగించింది. ఇలాంటి సంఘటన 2018 ఆగస్టులోనూ ఎయిర్ ఇండియా విమానంలో జరిగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *