[ad_1]
ఏరోస్పేస్ కంపెనీ..
యూరప్ కు చెందిన ఏరోస్పేస్ దిగ్గజం ఎయిర్ బస్ తమ కంపెనీలు ఇంజనీరింగ్, ఐటీ ఉద్యోగులను నియమించుకోవాలని నిర్ణయించింది. ఈ నెలలో బెంగళూరులో జరగనున్న ‘ఏరో ఇండియా’లో ఇది జరగనుంది. అయితే కంపెనీ తన విస్తరణ ప్రణాళికలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా మెుత్తం 13,000 మంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల భారత నిపుణులు సైతం ప్రయోజనం పొందనున్నారు.
అందుకే నియామకాలు..
డీకార్బనైజేషన్ రోడ్‌మ్యాప్, విమానయాన భవిష్యత్తు కోసం సన్నాహాల్లో కొత్త నియామకాలు కీలకంగా ఉంటాయని గ్లోబల్ ఏరోస్పేస్ సంస్థ ఎయిర్ బస్ వెల్లడించింది. ఆసియాలోనే అతిపెద్ద ఏరోస్పేస్ ఎగ్జిబిషన్‌గా పేరొందిన “ఏరో ఇండియా ” 14వ ఎడిషన్ ఫిబ్రవరి 13- 17 వరకు బెంగళూరు కేంద్రంగా జరగనుంది.
కెరీర్ అవకాశాలు..
ఔత్సాహిక అభ్యర్థులు హాల్ సిలోని స్టాండ్ నంబర్ CR7.1 వద్ద ఎయిర్‌బస్ ఎగ్జిక్యూటివ్‌లను కలుసుకోవచ్చు. అక్కడ వారు ఎయిర్‌ఫ్రేమ్ డిజైన్, ఏవియానిక్స్, ఎయిర్‌క్రాఫ్ట్ సిస్టమ్స్ సిమ్యులేషన్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ అండ్ క్యాబిన్ ఇంజనీరింగ్‌లో కెరీర్ అవకాశాలను అన్వేషించవచ్చని కంపెనీ ప్రకటన ద్వారా తెలుస్తోంది. ఏరోస్పేస్ పట్ల మక్కువ కలిగిన అత్యుత్తమ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్‌మెంట్ ప్రతిభకు ఎయిర్‌బస్ అత్యుత్తమ గమ్యస్థానంగా ఉందని ఎయిర్‌బస్ ఇండియా, దక్షిణాసియా హెచ్‌ఆర్ డైరెక్టర్ సూరజ్ చెత్రీ అన్నారు.
[ad_2]
Source link