[ad_1]
గతంలో 30 శాతం టాక్స్..
ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షించేందుకు దుబాయ్ రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అలా చాలా వస్తువులపై జీరో టాక్స్ లేదా తక్కువ పన్నులను ఆఫర్ చేస్తోంది. దీనిలో భాగంగా ఇప్పుడు మద్యంపై పన్నును కూడా తగ్గించింది. గతంలో 30 శాతం వరకు పన్నును వసూలు చేసేది. న్యూ ఇయర్ సందర్భంగా.. దుబాయ్ అడ్మినిస్ట్రేషన్ మద్యం అమ్మకాలపై పన్ను, లైసెన్స్ ఫీజును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
పర్యాటకం ప్రోత్సహం..
2023 కొత్త సంవత్సరం సందర్భంగా దుబాయ్ రాజకుటుంబం తాజా ప్రకటన చేసింది. దేశంలో పర్యాటకాన్ని మరింతగా ప్రోత్సహించటంలో భాగంగా 30 శాతం పన్నును రద్దు చేయాలని నిర్ణయించినట్లు మీడియా కథనాల ప్రకారం తెలుస్తోంది. కొత్త సంవత్సరం సందర్భంగా దుబాయ్‌లోని రెండు ప్రభుత్వ మద్యం కంపెనీలైన మారిటైమ్, మెర్కంటైల్ ఇంటర్నేషనల్ ఈ ప్రకటన చేశాయి.
రంజాన్ సందర్భంగా..
పర్యాటకాన్ని పెంచేందుకు దుబాయ్ అనేక స్నేహపూర్వక చర్యలు తీసుకుంది. ఇటీవల రంజాన్ మాసంలో పగటిపూట మద్యం విక్రయించేందుకు అనుమతి కూడా ఇచ్చింది. కొవిడ్ లాక్డౌన్ కొనసాగుతున్న సమయంలో ఇంటి వద్దకే మద్యం డెలివరీని కూడా ప్రారంభించింది. ఈ నిర్ణయాల వెనుక దుబాయ్‌కి మద్యం విక్రయాల ద్వారా వచ్చే ఆదాయమే కారణంగా ఉంది. అయితే ఇప్పుడు మాద్యంపై టాక్స్ రద్దు నిర్ణయం తీసుకోవటంతో దుబాయ్ ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోవాల్సి ఉంటుంది. కానీ ఇది పర్యాటకాన్ని పెంచి ఇతర మార్గంలో ఆదాయాన్ని తెచ్చిపెట్టవచ్చని అక్కడి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
దుబాయ్‌లో ముస్లిమేతరులకు..
దుబాయ్‌లోని చట్టాల ప్రకారం.. ముస్లిమేతరులు మద్యం సేవించడానికి 21 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. మద్యం సేవించేవారు దుబాయ్ పోలీసులు జారీ చేసిన ప్లాస్టిక్ కార్డును తప్పనిసరిగా తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ కార్డు బీర్, వైన్, మద్యం కొనుగోలు చేయడానికి అనుమతిస్తుంది. కార్డు హోల్డర్లు మద్యాన్ని వినియోగించటంతో పాటు తమతో తీసుకెళ్లవచ్చు. కానీ కార్డు లేనివారు ఇలాంటి పనులకు పాల్పడితే జరిమానా చెల్లించుకోక తప్పదు.
దుబాయ్ పొరుగు దేశాలు..
దుబాయ్ పక్కన షార్జా ఉంది. అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భాగం. అక్కడ మద్యం నిషేధించబడింది. అదేవిధంగా ఇతర పొరుగు దేశాలైన ఇరాన్, కువైట్, సౌదీ అరేబియాలో మద్యం నిషేధించబడింది.
[ad_2]
Source link