PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Amazon Air: వాయువేగంతో అమెజాన్ డెలివరీలు.. హైదరాబాద్ కేంద్రంగా.. కేటీఆర్ ఏమన్నారంటే..


కార్గో విమానాలు..

అమెరికా, యూరప్ తర్వాత భారతదేశంలో అమెజాన్ ఎయిర్‌ను కంపెనీ పరిచయం చేసింది. ఇందులో భాగంగా ఈ-కామర్స్ దిగ్గజం బోయింగ్ 737-800 విమానాల పూర్తి కార్గో సామర్థ్యాన్ని ఉపయోగించాలని నిర్ణయించింది. దీని ద్వారా ముంబై, బెంగళూరు, హైదరాబాద్, దిల్లీ నగరాల్లో వేగవంతమైన డెలివరీలను అందించాలని కంపెనీ యోచిస్తోంది. కంపెనీ ప్రారంభిస్తున్న ఈ సర్వీస్ రవాణా నెట్‌వర్క్‌ను మెరుగుపరచటంతో పాటు డెలివరీల వేగవంతాన్ని సులభతరం కానున్నట్లు తెలుస్తోంది.

 కంపెనీ డీల్..

కంపెనీ డీల్..

వాయువేగంతో వ్యాపారంలో ముందుకు సాగేందుకు అమెజాన్ బెంగుళూరుకు చెందిన కార్గో ఎయిర్‌లైన్ క్విక్‌జెట్‌తో జతకట్టింది. అలా కంపెనీ తన తొలి ఎయిర్ ఫ్రైట్ సర్వీసును ప్రారంభించింది. డెలివరీల కోసం ప్రత్యేకమైన ఎయిర్ నెట్‌వర్క్‌ను అందించడానికి థర్డ్-పార్టీ క్యారియర్‌తో భాగస్వామిగా మారిన ఈ-కామర్స్ కంపెనీగా అమెజాన్ మారింది. డెలివరీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి కంపెనీ తన పెట్టుబడుల స్పీడ్ కొనసాగిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఫుల్‌ఫైల్‌మెంట్ సెంటర్‌ల నుంచి లాస్ట్-మైల్ డెలివరీలకు సరుకులను వేగంగా రవాణా చేయడంలో ఈ చర్యలు దోహదపడతాయని స్పష్టం చేసింది.

అమెజాన్ ప్రేమాయణం..

హైదరాబాద్‌లో తెలంగాణ పరిశ్రమలు & వాణిజ్య శాఖ మంత్రి కేటీఆర్ సమక్షంలో కంపెనీ తన నూతన సేవలను ప్రారంభించింది. దీనిపై కేటీఆర్ ట్విట్టర్ వేధికాగా స్పందిస్తూ.. అమెజాన్ ప్రపంచంలో అతిపెద్ద క్యాంపస్, 4.4 బిలియన్ డాలర్ల విలువైన ఏడ్ల్యూఎస్ సెంటర్, ఆసియాలోనే అతిపెద్ద ఫుల్ ఫిల్ మెంట్ సెంటర్, తాజాగా అమెజాన్ ఎయిర్ సేవలకు హైదరాబాద్ కేంద్రంగా మారటంపై సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ పై అమెజాన్ కు ఉన్న ప్రేమ ఇదంటూ పెట్టిన హెడ్ లైన్ ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రపంచ ప్రఖ్యాత వ్యాపార సంస్థలకు హైదరాబాద్ ప్రథమ ఎంపికగా మారటంపై తెలుగు ప్రజలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

2016లో అమెజాన్..

2016లో అమెజాన్..

అమెజాన్ ఎయిర్ సేవలను అమెరికాలో ప్రారంభించి ఇప్పటికే 6 ఏళ్లు గడుస్తోంది. తొలుత 2016లో ఈ సేవను అమెజాన్ మూడు డజన్లకు పైగా బోయింగ్ ఫైటర్ విమానాలతో ప్రారంభించింది. ఆ తర్వాత ఆ సేవలను యూకేలో ప్రారంభించింది. తాజాగా ఈ సేవలను ఇండియాలో ప్రైమ్ ఎయిర్‌ పేరుతో మెుదలు పెట్టింది. ఇది డ్రోన్‌లను ఉపయోగించి డెలివరీలను అందించే ఇ-కామర్స్ దిగ్గజంచే ప్రత్యేక సర్వీస్ అని చెప్పుకోవాలి. అమెజాన్ వాల్‌మార్ట్-మద్దతుగల ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ను వ్యాపారంలో ధీటుగా ఎదుర్కొనేందుకు అమెజాన్ తాజా ప్రయత్నం సహాయపడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.





Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *