News
oi-Chekkilla Srinivas
అమెజాన్
ఉద్యోగులకు
షాక్
ఇచ్చింది.
భారత్
లోని
తనకున్న
వివిధ
వ్యాపారాల్లో
500
మంది
ఉద్యోగులను
తొలగించాలని
నిర్ణయం
తీసుకున్నట్లు
తెలిసింది.
నివేదిక
ప్రకారం
తొలగింపు
ప్రక్రియ
కొనసాగుతోంది.
మరియు
అమెజాన్
వెబ్
సర్వీసెస్
(AWS),
మానవ
వనరులు,
సపోర్ట్
ఫంక్షన్‌ల
నుంచి
ఉద్యోగులను
తొలగిస్తున్నట్లు
సమాచారం.
ఈ
తాజా
తొలగింపులు
మార్చి
2023లో
చేసిన
9,000
ఉద్యోగాల
కోత
ప్రకటనలో
భాగమని
అమెజాన్
తెలిపినట్లు
తెలుస్తోంది.
మార్చిలో
అమెజాన్
తన
క్లౌడ్
సేవలు,
ప్రకటనలు,
ట్విచ్
యూనిట్ల
నుంచి
మాంద్యం
భయాల
కారణంగా
దాదాపు
9,000
ఉద్యోగాలను
తగ్గించేందుకు
నిర్ణయం
తీసుకుంది.
ఆ
తర్వాత
కంపెనీ
సుమారు
18,000
మంది
ఉద్యోగులను
తొలగించారు.
గత
కొన్ని
సంవత్సరాలుగా
కంపెనీ
గణనీయమైన
మొత్తంలో
ఉద్యోగుల్ని
తీసుకుంది.
అయితే
అనిశ్చిత
ఆర్థిక
వ్యవస్థతో
ఉద్యోగుల
కోత
తప్పలేదని
కంపెనీ
తెలిపింది.

“మేము
నివసించే
అనిశ్చిత
ఆర్థిక
వ్యవస్థ
మరియు
సమీప
భవిష్యత్తులో
ఉన్న
అనిశ్చితి
కారణంగా,
మేము
మా
ఖర్చులు,
హెడ్‌కౌంట్‌లో
మరింత
క్రమబద్ధీకరించాలని
ఎంచుకున్నాము”
అని
CEO
ఆండీ
జాస్సీ
ఉద్యోగులకు
జారీ
చేసిన
మెమోలో
పేర్కొన్నారు.
ఏప్రిల్‌లో
Amazon.com
Inc.
దాని
విస్తృత
కోతల్లో
భాగంగా
దాని
వీడియో-గేమ్
విభాగాలలో
సుమారు
100
మంది
ఉద్యోగులను
తొలగించింది.
ఇది
ప్రైమ్
గేమింగ్,
గేమ్
గ్రోత్,
కంపెనీ
శాన్
డియాగో
స్టూడియోలోని
కార్మికులను
ప్రభావితం
చేసింది.
అమెజాన్
మాత్రమే
కాదు
మైక్రోసాఫ్ట్,
ట్విట్టర్,
గూగుల్,
మెటా
వంటి
దిగ్గజ
సంస్థలు
ఉద్యోగుల్ని
తొలగించాయి.
ఈ
కంపెనీలు
ఎక్కువగా
యూఎస్
తో
వివిధ
దేశాల్లో
ఉద్యోగులను
తొలగించాయి.
తాజాగా
అమెజాన్
మాత్రం
ఇండియాలో
ఉద్యోగుల
తొలగింపు
ప్రక్రియ
చేపట్టింది.
దీంతో
భారత్
లో
కూడా
వివిధ
కంపెనీలు
ఉద్యోగాలు
తొలగిస్తాయన్న
భయంతో
చాలా
మంది
ఉద్యోగులు
ఆందోళనలో
ఉన్నారు.
English summary
Amazon has started the process of layoffs in India
Amazon employees were shocked. It is known that he has decided to lay off 500 employees in his various businesses in India.
Story first published: Tuesday, May 16, 2023, 11:20 [IST]