News

oi-Chekkilla Srinivas

|

పేమెంట్ కంపెనీ అమెజాన్ పేకు ఆర్బీఐ షాకిచ్చింది. ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (పిపిఐలు), నో యువర్ కస్టమర్ (కెవైసి) డైరెక్షన్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలను పాటించనందుకు అమెజాన్ పే (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ. 3.06 కోట్ల జరిమానాను శుక్రవారం ఆర్బీఐ విధించింది.

“కెవైసి అవసరాలపై ఆర్‌బిఐ జారీ చేసిన ఆదేశాలకు ఎంటిటీ కట్టుబడి లేదని ” అని ఆర్‌బిఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఆర్‌బిఐ అమెజాన్ పే (ఇండియా)కి నోటీసు జారీ చేసింది. ఆదేశాలను పాటించనందుకు జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చెప్పాలని స్పష్టం చేసింది. “ఎంటిటీ ప్రతిస్పందనను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, RBI ఆదేశాలను పాటించనందుకు జరిమానా విధిస్తున్నట్లు” ఆర్బీఐ పేర్కొంది.

Amazon Pay: అమెజాన్ పేకు షాకిచ్చిన ఆర్బీఐ..

అయితే, సెంట్రల్ బ్యాంక్, పెనాల్టీని రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉంటుంది. అమెజాన్ పే అనేది ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ డిజిటల్ చెల్లింపు విభాగం. ఆర్బీఐ జరిమానా విధింపు పై అమెజాన్ పే ఇండియా ఇప్పటి వరకు స్పందించలేదు.

English summary

Amazon Pay has been fined Rs 3.06 crore by the RBI for non-compliance

RBI slaps payment company Amazon Pay. Amazon Pay (India) Pvt Ltd has been fined Rs. 3.06 crore fine was imposed by RBI on Friday.

Story first published: Saturday, March 4, 2023, 10:41 [IST]



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *