[ad_1]
అంబానీ లక్ష్యం..
రిలయన్స్ గ్రూప్ రథసారధిగా 20 ఏళ్లు పూర్తి చేసుకున్న ముకేష్ అంబానీ కంపెనీని మరింతగా ముందుకు తీసుకెళ్లేందుకు వేగం పెంచారు. రానున్న కాలంలో గ్రూప్ వ్యాపారాలు మరింతగా విస్తరించి మర్రి చెట్టు మాధిరిగా మరింత పెద్దదిగా ఎదుగుతుందని ముకేష్ వ్యాఖ్యానించారు. ధీరూభాయ్ పుట్టినరోజు రిలయన్స్ ఫ్యామిలీ డే సందర్భంగా అంబానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ స్థాయి వ్యాపారాలను నిర్మించటం ద్వారా దేశాన్ని వృద్ధి చేయటమే రిలయన్స్ లక్ష్యమని అంబానీ వెల్లడించారు.
రానున్న 25 ఏళ్లలో..
5000 ఏళ్ల భారతదేశ చరిత్రలో రానున్న 25 ఏళ్లు అత్యంక కీలకంగా మారనున్నాయని అన్నారు. ఈ సమయంలో దేశ పరివర్తన వేగంగా సాగుతుందని ఆయన ఆకాంక్షించారు. 2047 నాటికి ఇండియా ప్రపంచంలో 40 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారుతుందని అంబానీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జియో 5జీ సాంకేతిక సేవలను అందుబాటులోకి తీసుకురావటంలో కీలకంగా మారిన తనయుడు ఆకాష్ అంబానీని ప్రశంశించారు. 2023లో కంపెనీ దేశవ్యాప్తంగా 5జీని అందుబాటులోకి తీసుకొచ్చే ప్రక్రియను పూర్తి చేస్తుందని అంబానీ వెల్లడించారు.
రిలయన్స్ రిటైల్..
ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వెంచర్స్ వ్యాపారాన్ని అంబానీ కుమార్తె ఇషా నాయకత్వంలోకి వెళ్లిన తర్వాత రాకెట్ వేగంతో వృద్ధి చెందుతోంది. దీనికి తోడు ఈ రంగంలోని ఇతర కంపెనీల కొనుగోలు, మరిన్ని కొత్త వ్యాపారాలను రిలయన్స్ రిటైల్ కిందకు తీసుకురావటం, బ్రాండ్లను చేజిక్కించుకోవటం వంటి వ్యూహాత్మక నిర్ణయాలు వేగంగా జరుగుతున్నాయి. భారతదేశ సమ్మిళిత అభివృద్ధిపై ఇది క్యాస్కేడింగ్ ప్రభావాన్ని చూపుతుందని ఆయన నొక్కి చెప్పారు. దీనికి తోడు రిలయన్స్ తన జియో మార్ట్ వ్యాపారం ద్వారా హోల్ సేల్ కిరాణా రంగంలో మారుమూల ప్రాంతాల వినియోగదారులకు సైతం చేరువవుతోంది.
కొత్త ఉద్యోగాలు..
దేశంలోని యువతకు రానున్న కాలంలో అనేక ఉపాధి అవకాశాలు లభిస్తాయని రిలయన్స్ అధినేత అన్నారు. దీనికి తోడు రైతులకు అధిక ఆదాయం వస్తుందని అన్నారు. దీనికి తోడు కలిసి కంపెనీతో పనిచేస్తున్న SMEలు, పెద్ద తయారీదారులు మరింత ఉత్పాదకతను పొందుతారని అన్నారు. అలా వ్యాపార భాగస్వాములు మరింత సంపన్నులు అవుతారని అంబానీ పేర్కొన్నారు. కొత్త ఏడాది 2023 రిలయన్స్ ఫౌండేషన్‌కు పునరుద్ధరణ, పునరుజ్జీవన సంవత్సరంగా ఉంటుందని వ్యాపార దిగ్గజం చెప్పుకొచ్చారు.
[ad_2]
Source link