గొప్ప విజయం..

పరిస్థితులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్న ప్రస్తుత తరుణంలో అదానీ మంచి జాక్ పాట్ కొట్టారు. ఇది ఆయన కొత్తగా కొనుగోలు చేసిన సిమెంట్ వ్యాపారానికి చాలా కీలకమైనది. అదానీకి చెందిన అంబుజా సిమెంట్ లిమిటెడ్ భారీ డీల్‌ను దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒడిశాలోని ఉస్కల్‌వాగు సున్నపురాయి బ్లాక్‌కు ప్రాధాన్య బిడ్డర్‌గా అదానీ కంపెనీ ఎంపికైనట్లు కంపెనీ తెలిపింది.

సున్నపురాయి గనులు..

సున్నపురాయి గనులు..

మల్కన్‌గిరి జిల్లాలో ఉన్న సున్నపురాయి బ్లాక్ కోసం ఒడిశా ప్రభుత్వం ఈ-వేలం నిర్వహించింది. ఇందులో అదానీ గ్రూప్ కు చెందిన అంబుజా సిమెంట్ కూడా బిడ్ దాఖలు చేసింది. అయితే బిడ్ ఎంతకు దాఖలు చేసిందనే విషయం వెల్లడికాలేదు. 547 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న ఈ బ్లాక్ లో మెుత్తం 141 మిలియన్ టన్నుల సున్నపురాయి నిక్షేపాలు ఉన్నాయని అంచనా. బిడ్ పొందినట్లు అంబుజా సిమెంట్ స్టాక్ మార్కెట్ కు వెల్లడించింది.

అంబుజా స్టాక్..

అంబుజా స్టాక్..

బిడ్ గెలిచిన వార్త వెలువడటంతో అంబుజా సిమెంట్ స్టాక్ 3 శాతం మేర లాభపడింది. మధ్యాహ్నం 2.32 గంటల సమయంలో అంబుజా సిమెంట్స్ స్టాక్ ధర రూ.348.85 వద్ద ఉంది. హిండెన్ బెర్గ్ నివేదిక తర్వాత కంపెనీ స్టాక్ విలువ క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.598గా ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.274 వద్ద ఉంది. ఏడాది ప్రాతిపధికన స్టాక్ దాదాపు 34 శాతం మేర మార్కెట్ విలువను కోల్పోయింది.Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *