గతేడాదితో పోలిస్తే అధిక GSDP:

2022-23కి ఆంధ్రప్రదేశ్ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి(GSDP) వృద్ధిరేటు 16.22 శాతంగా నమోదైనట్లు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే మరింత వేగంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకున్నట్లు చెప్పింది. గత ఆర్థిక సంవత్సరానికి GSDP 11 లక్షల కోట్లకు పైగా అంచనా వేయగా.. ఈ ఏడాది 13 లక్షల కోట్లు లక్ష్యంగా నిర్ణయించారు. అంటే అప్పటితో పోలిస్తే దాదాపు 2 లక్షల కోట్లు అధికమన్నమాట.

ప్రధాన రంగాల్లో మంచి వృద్ధి:

ప్రధాన రంగాల్లో మంచి వృద్ధి:

వ్యవసాయం, అనుబంధ రంగాల స్థూల విలువ ఆధారిత వృద్ధి రేటు 13.18 శాతంగా నమోదైంది. వ్యవసాయం, మత్స్య సంపద విభాగాలు దాదాపు 20 శాతం దగ్గర పోటిపడుతున్నాయి. ఇక పరిశ్రమల రంగం 16.36 శాతం, సేవల రంగం 18.91 శాతం చొప్పున GVA సాధించాయి. హోటళ్లు, రవాణా, రియల్ ఎస్టేట్ విభాగాలు మంచి వృద్ధిని కనబరచినట్లు ప్రభుత్వం ప్రకటించింది.

గత ఆర్థిక సంవత్సరంలో ఇలా..

గత ఆర్థిక సంవత్సరంలో ఇలా..

2021-22లో దేశ వృద్ది రేటు 7 శాతం ఉండగా.. స్థిరమైన ధరల వద్ద ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో 7.02 నమోదు చేసింది. మొత్తంగా చూస్తే వ్యవసాయం 36.19, పరిశ్రమలు 23.36, సేవల రంగం 4.45 శాతం వృద్ధి సాధించాయి. అప్పుడు దాదాపు 2 లక్షల కోట్లుగా ఉన్న రాష్ట్ర తలసరి ఆదాయం 2022-23లో 2.20 లక్షల కోట్లకు పెరిగింది.

ప్రజాసంక్షేమం, ప్రభుత్వ పథకాలు:

ప్రజాసంక్షేమం, ప్రభుత్వ పథకాలు:

నవరత్నాలు సహా ఇతర పథకాల విషయానికొస్తే.. విద్య, ఆరోగ్యం, మహిళలు, రైతులు, సంక్షేమం మొదలైన వాటి కోసం ఇప్పటివరకు రూ.1.97 లక్షల కోట్లను ఏపీ ప్రభుత్వం వెచ్చించింది. ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా ఈ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమచేసింది. రైతుల సంక్షేమం కోసం 27 వేల కోట్లు కేటాయించగా.. 52.38 లక్షల కర్షక కుటుంబాలు లబ్ధి పొందాయి.

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో అగ్రస్థానం:

ఈజ్ ఆఫ్ డూయింగ్ లో అగ్రస్థానం:

విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023ని ఏపీ ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించింది. 6 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు రూ.13.42 లక్షల కోట్ల నిబద్ధతతో 378 అవగాహన ఒప్పందాలు కుదిరాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో AP వరుసగా 3 సంవత్సరాలు మొదటి ర్యాంక్‌ ను పొందింది. తద్వారా పెట్టుబడిదారుల విశ్వాసాన్ని చూర గొన్నట్లు సామాజిక ఆర్థిక సర్వే 2022-23 పేర్కొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *