ANDHRA PRADESH – GOVERNMENT SCHEMES

ఆంధ్రప్రదేశ్ లో జగన్ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రజలకు నేరుగా ఇంటి దగ్గర్లోకే ప్రభుత్వ పధకాలు అందించటం కోసం అద్భుతంగా, గ్రామాలలో గ్రామ సచివాలయాలు, నగరాలు, పట్టణాలలో వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకొచ్చింది. ప్రతీ 50 / 100 ఇళ్ళకూ ఒక వాలంటీర్ ను ఏర్పాటు చేసి వారి ద్వారా ప్రజల అవసరాలు గుర్తించటం జరుగుతోంది. ప్రజలు చేయవలసిందల్లా వారి అవసరం ఏమిటో వారికి కేటాయించిన వాలంటీర్ కి చెప్పటమే. వారు అర్హులైతే, పధకాలు వారికి వర్తించేట్లు అతి తక్కువ సమయంలోనే చేయటం జరుగుతోంది.

నవరత్నాలు

1.ఆరోగ్యశ్రీ

2. ఫీజు రీయింబర్స్‌మెంట్

3. పేదలందరికీ ఇళ్లు

4. వైయస్ఆర్ రైతు భరోసా

5. అమ్మఒడి

6. పింఛన్ల పెంపు

7. జలయజ్ఞం

8. వైయస్ఆర్ ఆసరా

********************

ఇవే కాకుండా

********************

వై.ఎస్.ఆర్ నేతన్న నేస్తం

వై.యస్.ఆర్. వాహన మిత్ర

జగనన్న చేదోడు – టైలర్లు

జగనన్న చేదోడు – నాయీ-బ్రాహ్మణులు

జగనన్న చేదోడు – రజకులు

వై యస్ ర్ చేయూత

వై.ఎస్.ఆర్. కాపు నేస్తం

జగనన్న విద్యా దీవెన

జగనన్న వసతి దీవెన

బియ్యం కార్డు

వై.ఎస్.ఆర్. భీమా – ఇన్సూరెన్స్ పధకం

జగనన్న తోడు

బ్రాహ్మణ కార్పోరేషన్

వేదవ్యాస

గ్రామ – వార్డు సచివాలయము

సచివాలయాల ద్వారా ఇంటి ముంగిటకే పాలన…

దేశంలో ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తెచ్చింది. అవినీతికి కానీ, వివక్షతకు కానీ తావు ఇవ్వకూడదని, పరిపాలన అన్నది ప్రజలకు చేరువ కావాలన్న ప్రధాన ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై యస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. గ్రామ,వార్డు సచివాలయాల్లో దాదాపు 35 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 500 సేవలు అందుబాటులో ఉంటాయి.

పింఛన్ కావాలన్నా..రేషన్ కార్డు కావాలన్నా.. ఇంటి పట్టాలు కావాలన్నా.. తాగునీటి సరఫరా సమస్య ఉన్నా.. సివిల్ పనులకు సంబంధించిన పనులు ఉన్నా.. వైద్యం కానీ.. ఆరోగ్యం కానీ.. రెవిన్యూ కానీ.. భూముల సర్వేకానీ.. శిశు సంక్షేమం కానీ.. డెయిరీ కానీ, పౌల్ట్రీ రంగాల సేవలు కానీ.. ఇలాంటివెన్నో గ్రామ సచివాలయాల్లో అర్జీ పెట్టుకున్న 72 గంటలోనే సమస్యను పరిష్కరిస్తారు.