ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది..

అశ్వగంధ ఒత్తిడి, ఆందోళన స్థాయిలను తగ్గిస్తుంది, ఇది సహజమైన అడాప్టోజెన్‌గా పనిచేస్తుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడుతుంది. ఇది ఒత్తిడి హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. కార్టిసాల్ స్థాయిలను తగ్గించడం ద్వారా, ఒత్తిడి స్థాయిలు తగ్గుతాయి. ఇది తీసుకుంటే మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది.​

Mental Health: ఒత్తిడితో ఇబ్బందిపడుతున్నారా..? ఈ అలవాట్లు మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచుతాయ్..!

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది..

మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది..

అశ్వగంధ జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది రియాక్షన్‌ సమయం, విజువల్‌ మోటర్‌ సమన్వయం, అటెన్షన్‌ స్పాన్‌ను తగ్గిస్తుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి. ఇది దెబ్బతిన్న మెదడు కణాలను కూడా రిపేర్ చేస్తుంది.​

Psoriasis: వేసవిలో సోరియాసిస్‌ తగ్గాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..!

హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది..

హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తుంది..

అశ్వగంధ హార్మోన్లను ఉత్పత్తి చేసే అడ్రినల్ గ్రంధిని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది మొత్తం హార్మోన్ల వ్యవస్థను సమతుల్యం చేయడానికి తోడ్పడుతుంది. ఇది సంతానోత్పత్తి సామర్థ్యం, టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచుతుంది. పీసీఓడీ, ఇతరత్రా నెలసరి సమస్యలతో బాధపడేవాళ్లకి ఇది ఎంతో మేలు చేస్తుంది. మెనోపాజ్‌ సమయంలో తలెత్తే అనేక సమస్యలకు ఇది మందులా పనిచేస్తుంది.

కొలెస్ట్రాల్‌ కరిగిస్తుంది..

కొలెస్ట్రాల్‌ కరిగిస్తుంది..

అశ్వగంధను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇది గుండె జబ్బులు, స్ట్రోక్‌ను నివారించడంలో సహాయపడుతుంది.

రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది..

రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది..

అశ్వగంధ రక్త ప్రసరణను పెంచి స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక శక్తి పెరిగేలా చేస్తుంది. ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతున్న పురుషులు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల స్పెర్మ్‌ కౌంట్‌ శాతం పెరుగుతుందని అధ్యయనంలో తేలింది. అదేసమయంలో టెస్టోస్టెరాన్‌ హార్మోన్‌ శాతం పెరగడంతో కండరాలూ శక్తిమంతమవుతాయి.

ఇన్ఫ్లమేటర్‌ లక్షణాలు మెరుగుపరుస్తాయ్..

ఇన్ఫ్లమేటర్‌ లక్షణాలు మెరుగుపరుస్తాయ్..

అశ్వగంధలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపు, మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఇది ఆర్థరైటిస్, ఆస్తమా, దీర్ఘకాలిక నొప్పికి కూడా గొప్ప ఔషధంలా పనిచేస్తాయి. నిద్రలేమినీ కీళ్లనొప్పుల్నీ తగ్గించే గుణం కూడా దీనికి ఉంది. మతిమరుపుతో బాధపడుతోన్నవాళ్లకీ అశ్వగంథ మంచి మందే.​

Thyroid Issues: థైరాయిడ్‌లో వచ్చే.. 4 సాధారణ సమస్యలు ఇవే..!

అందాన్ని రెట్టింపు చేస్తుంది..

అందాన్ని రెట్టింపు చేస్తుంది..

ఒత్తిడిలో కార్టిసోల్‌ హార్మోన్‌ విడుదలై, చర్మం ప్రభావితమై, మొటిమలు, మచ్చలు వంటి సమస్యలకు దారితీస్తుంది. ఆ హార్మోన్‌ ప్రభావాన్ని చర్మంపై పడకుండా అశ్వగంధ కాపాడుతుంది. ఇది వృద్ధాప్య ఛాయలను అడ్డుకుంటుంది. అశ్వగంధలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలు రాకుండా చేస్తాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మాన్ని ఒత్తిడికి గురి కాకుండా చేసి మృదువుగా మారుస్తాయి. కంటికింద నల్లని వలయాలు, ముడతలను దూరం చేస్తుంది. మెలనిన్‌ ఉత్పత్తిని తగ్గించి, పిగ్మంటేషన్‌ సమస్యనూ రానివ్వదు.​

Fish Health Benefits: చేపలు తింటే.. గుండెకు మంచిదా..? గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *