మంగళవారం కటింగ్ తీసుకోవడం వల్ల ఆయుష్షు తగ్గుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
Feature
oi-Chekkilla Srinivas
సాధారణంగా మంగళవారం కటింగ్ తీసుకొవద్దని పెద్దలు చెబుతుంటారు. మంగళవారం కూడా చాలా వరకు కటింగ్ షాపులు మూసే ఉంటాయి. అయితే మరి మంగళవారం కటింగ్ ఎందుకు తీసుకోవద్దని మీరు అడగొచ్చు.. తానికి జ్యోతిష్యులు పలు కారణాలు చెప్పారు. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మంగళవారం కటింగ్ తీసుకోవడం వల్ల మంగళవారం ఎనిమిది నెలల ఆయుష్షు తగ్గుతుందట. అంతేకాకుండా ఇంట్లో ప్రతికూలత, అనారోగ్య సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. అలాగే కటింగి చేసుకున్న తర్వాత స్నానం చేసిన తర్వాతే ఇంట్లోకి రావాలని సూచిస్తున్నారు. ఇవే కాకుండా రాత్రి సమయంలో కటింగ్ చేసుకోకూడదు. తండ్రి కొడుకులు, అన్నదమ్ములు ఒకే రోజు చేసుకోకూడదని చెబుతున్నారు.

శాస్త్రాల ప్రకారం మీరు హెయిర్ కట్ ఎప్పుడు చేసుకున్నా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 లోపు పూర్తి చేసుకోవాలట. అప్పుడే మంచి ఫలితాలు ఉంటాయి. సాయంత్రం లేదా రాత్రి సమయాల్లో హెయిర్ కట్ చేసుకోకూడదు. అంతేకాకుండా తండ్రి, కొడుకులు, అన్నదమ్ములు కూడా ఒకేరోజు హెయిర్ కట్ చేసుకోకూడదట. సోమవారం నాడు క్షౌరం చేసుకుంటే మీకు ఏడు నెలల ఆయుష్షు పెరుగుతుందని వివరిస్తున్నారు.
బుధవారం నాడు హెయిర్ కటింగ్ చేసుకుంటే ఐదు నెలల ఆయుష్షు పెరుగుతుందని చెబుతారు. ఇదే సమయంలో ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. కుటుంబంలో సుఖ, సంతోషాలుస ధనప్రాప్తి ఉంటుందట. కటింగ్ తోపా చేతి గోర్లను కూడా ఎప్పుడు పడితే అప్పుడు తీయకూడదని చెబుతారు.
note: ఈ సమాచారం కేవలం జ్యోతిష్యుల అభిప్రాయం మాత్రమే.. దీనిని వన్ ఇండియా ధృవీకరించలేదు.
English summary
Generally elders say not to take cutting on Tuesday. Most of the cutting shops are closed on Tuesdays as well.
Story first published: Monday, February 20, 2023, 13:03 [IST]