‘ఇంత తీవ్రమైన భూ అయస్కాంత తుఫాను చివరిసారిగా 2015లో సంభవించింది.’ అని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా సీఎంఈ సమయంలో రంగుల విస్ఫోటనం సంభవించింది. ఐరోపాలోని ఫ్రాన్స్, జర్మనీ, ఉత్తర అమెరికాలో ద్వీపాలు, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, కొలరాడో, న్యూ మెక్సికోలో తక్కువ అక్షాంశాలకు ఆరోరా చేరుకుంది. అరోరాలు అరోరల్ జోన్‌ల వెలుపల సాపేక్షంగా అరుదైన సంఘటన అయినప్పటికీ రెండు అర్ధగోళాలలో 65, 75 డిగ్రీల అక్షాంశాల మధ్య ఉన్నాయి. సౌర కార్యకలాపాలు పెరగడం వంటి అంతరిక్ష వాతావరణ క్రమరాహిత్యాల సమయంలో భూమధ్యరేఖకు దగ్గరగా కనిపిస్తాయి.
గత నెలలో సంభవించిన భూ అయస్కాంత తుఫాను తీవ్రత 4వ స్థాయిగా వర్గీకరించారు. అంతరిక్ష వాతావరణ పరిణామాలో లడఖ్‌లో ఈ దృశ్యం సాధ్యమైంది. లడఖ్‌లోని హన్లే అబ్జర్వేటరీ ఏప్రిల్‌లో గుర్తించిన స్టాండర్డ్ ఆరోరా రెడ్ (SAR)ను ఐఐఏపీ విశ్లేషిస్తోంది. ‘ఏప్రిల్ 24 తెల్లవారుజామున ఆర్క్ ఉత్తర హోరిజోన్‌లో కనిపించింది.. చాలా సేపు ఉంది. కానీ, దురదృష్టవశాత్తు ఆ సమయంలో అబ్జర్వేటరీ నుంచి ఎవరూ బయటకు లేరు.. కాబట్టి దానిని నేరుగా చూడలేకపోయారు.. ఇది అబ్జర్వేటరీలో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే 360-డిగ్రీల స్కై కెమెరాలో మాత్రమే రికార్డ్ చేయబడింది’ అని ఐఐఏపీ వర్గాలు తెలిపాయి.
‘అరోరాలు సాధారణంగా ధ్రువాలకు దగ్గరగా ఉన్న ప్రదేశాలకు పరిమితం.. ఎందుకంటే సూర్యుడి నుంచి చార్జ్ చేయబడిన కణాలు భూ అయస్కాంత గోళాన్ని దాటి వాతావరణంలో ఆక్సిజన్, నైట్రోజన్‌తో సంకర్షణ చెంది కాంతి ప్రదర్శనను సృష్టించాయి.. అయినప్పటికీ, చాలా బలమైన కరోనల్ మాస్ ఎజెక్షన్ సంఘటనల సమయంలో సూర్యుని నుంచి పదార్థం అయస్కాంత గోళంలోకి చొచ్చుకుపోయి లడఖ్ వంటి ప్రదేశాలలో అరోరా ఏర్పడటానికి దారితీయవచ్చు’ అని ఆర్యభట్ట రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ దీపాంకర్ భట్టాచార్య అన్నారు.
Read More Latest Science & Technology And Telugu News