PRAKSHALANA

Best Informative Web Channel

PRAKSHALANA

Axis Bank: యాక్సిస్ బ్యాంక్ కళ్లు చెదిరే లాభాలు.. కానీ పడిపోయిన స్టాక్ ధర.. ఏం చేయాలి..?


కంపెనీ లాభాలు..

Q3 ఫలితాలతో యాక్సిస్ బ్యాంక్ అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేసింది. ఏడాది ప్రాతిపధికన నికర లాభం 62 శాతం పెరిగింది. కేటాయింపులకు బ్యాంక్ ఎక్కువ సొమ్మును ఎలకేట్ చేసినప్పటికీ అంచనాలను మించిన లాభాలను రిపోర్ట్ చేసింది. ఈ త్రైమాసికంలో రూ.5,853 కోట్ల లాభాన్ని డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో నమోదు చేసింది. గత సంవత్సరం ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.3,614 కోట్లుగా ఉంది.

పెరిగిన వడ్డీ ఆదాయం..

పెరిగిన వడ్డీ ఆదాయం..

మూడో త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 32.4% వృద్ధితో రూ.11,459 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ ఆదాయం అంటే.. బ్యాంక్ సంపాదించిన వడ్డీ, ఖర్చు చేసిన వడ్డీకి మధ్య ఉండే వ్యత్యాసం. దీనికి తోడు త్రైమాసికంలో కేటాయింపులు 8 శాతం పెరిగి రూ.1,438 కోట్లకు చేరుకున్నాయి. అయినప్పటికీ కంపెనీ లాభాలు ఊహించిన దానికంటే ఎక్కువగానే నమోదైంది. ఇదే సమయంలో బ్యాంక్ NPAల నిష్పత్తి తగ్గి 0.47 శాతానికి చేరుకున్నాయి.

కంపెనీ సీఈవో..

కంపెనీ సీఈవో..

బ్యాంకింగ్ రంగం గత కొన్ని త్రైమాసికాలుగా అభివృద్ధి చెందిన ఊపందుకునే మంచి స్థితిలో ఉందని యాక్సిస్ బ్యాంక్ MD & CEO అమితాబ్ చౌదరి అన్నారు. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ మార్కెట్లో స్టాక్ మెరవలేకపోయింది. స్టాక్ ధర ఈ ఉదయం 10.50 గంటల సమయంలో 2.21 శాతం మేర క్షీణించి రూ.911 వద్ద ట్రేడ్ అవుతోంది.

క్షీణిస్తున్న స్టాక్..

క్షీణిస్తున్న స్టాక్..

యాక్సిస్ బ్యాంక్ ఫలితాలు బాగున్నప్పటికీ రానున్న త్రైమాసికాల్లో పరిస్థితిపై మార్కెట్ వర్గాలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో చాలా మంది ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్కింగ్ కు మెుగ్గుచూపుతున్నందున స్టాక్ స్వల్పంగా నష్టపోయినట్లు ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్స్ రీసెర్చ్ హెడ్ ఎకె ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. ఐసీఐసీఐ బ్యాంక్ విషయంలోనూ ఇదే జరిగిందని తెలుస్తోంది.

బ్రోకరేజీల టార్గెట్స్..

బ్రోకరేజీల టార్గెట్స్..

– UBS యాక్సిస్ బ్యాంక్‌లో BUY రేటింగ్ తో.. టార్గెట్ ధరను రూ.1,100కి పెంచింది.

– CLSA యాక్సిస్ బ్యాంక్ షేర్లకు BUY రేటింగ్ కొనసాగిస్తూ.. రూ. 1,250 టార్గెట్ ధరగా నిర్ణయించింది. 2024-25 లాభాల అంచనాలను సైతం పెంచింది

– మోర్గాన్ స్టాన్లీ యాక్సిస్ బ్యాంక్ స్టాక్ టార్గెట్ ధరను రూ.1,200గా నిర్ణయించింది

– JP మోర్గాన్ యాక్సిస్ బ్యాంక్‌ షేర్లకు టార్గెట్ ధరను రూ. 990 నుంచి రూ.1,100కి పెంచింది

– HSBC యాక్సిస్ బ్యాంక్ షేర్లకు తన BUY రేటింగ్ కొనసాగిస్తూ టార్గెట్ ధరను రూ.1,200గా నిర్ణయించింది.



Source link

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *