[ad_1]
మన శరీరంలో కొన్ని కీలకమైన గ్రంథుల్లో థైరాయిడ్ ఒకటి. ఇది టి3, టి4 అనే రెండు హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. శ్వాసవ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, సంతానోత్పత్తి వ్యవస్థ… ఇలా చాలా వాటిపై థైరాయిడ్ హార్మోన్ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా పిండం ఎదిగే సమయంలో కణాలు ఎదుగుదలకు, జీవక్రియల సమన్వయానికి సహాయపడుతుంది. థైరాయిడ్ సమస్య ఉంటే.. జీవక్రియలు సజావుగా జరగడానికి సరిపడా థైరాక్సిన్ హార్మోన్‌ను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయలేదు. హైపోథలామస్, పిట్యూటరీ, థైరాయిడ్ వ్యవస్థలలో మార్పులు రావడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పులు వచ్చి.. హైపర్ థైరాయిడిజమ్, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు వస్తాయి.
హైపోథైరాయిడిజమ్..
శరీరానికి కావాల్సిన దానికంటే తక్కువ మోతాదులో థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. టి3, టి4 హార్మోన్లు తగ్గుతాయి. టీఎస్‌హెచ్ పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ సమస్య వంశపారంపర్యంగా రావచ్చు. ఈ మార్పులతో జీవక్రియ పనితీరు మందగిస్తుంది. శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. బరువు పెరిగిపోతారు. చుట్టూ ఉన్న వారికి చెమటలు పడుతుంటే, ఈ సమస్య ఉన్నవారికి మాత్రం చలిగా అనిపిస్తుంది. వీటన్నింటితో పాటు మలబద్ధకం, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, విపరీతమైన ఒళ్లు నొప్పులు, గోళ్లు విరిగిపోయినట్లు కనిపించడం, డిప్రెషన్.. పిల్లలు కలగకపోవడం, రక్తహీనత, నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడం లాంటి మార్పులు కనిపిస్తాయి. హైపోథైరాయిడ్ పేషెంట్స్‌కు సరస్వతి ఆకు.. గొప్ప ఔషధంలా పని చేస్తుందని సైకోథెరపిస్ట్ ఉషానందిని అన్నారు.
సరస్వతి ఆకు గొప్ప ఔషధం..
హైపోథైరాయిడ్ పేషెంట్స్ లక్షణాలను తగ్గించడానికి సరస్వతి ఆకు సహాయపడుతుందని డాక్టర్ ఉషానందిని అన్నారు. హైపోథైరాయిడిజం కారణంగా వచ్చే మలబద్ధకాన్ని బహ్మి సరిచేస్తుంది. హైపోథైరాయిడ్‌లో ముఖం, చేతులు, కాళ్ల వాపు సమస్య ఎక్కువగా ఉంటుంది. వల్లార్ మూత్రవిసర్జనకు పనిచేస్తుంది. ఇది మూత్రవిసర్జనను పెంచి.. వాపును తగ్గిస్తుంది. సరస్వతి ఆకులో.. ఈస్ట్రోజన్ హార్మన్ బ్యాలెస్స్ చేసే గుణాలు ఉన్నాయి. హైపోథారాయిడ్ కారణంగా వచ్చే నెలసరి సమస్యలను పరిష్కరిస్తుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి మెదడు పనితీరు మందగిస్తుంది.ఇది ఆలోచించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీనినే బ్రెయిన్ ఫాగ్ అంటారు.
(Image source – pixabay)
థైరాయిడ్‌కు చెక్..
బహ్మి ఆకులో జీవరసాయన పదార్థాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందులో ఎసిటిక్ యాసిడ్, ఎసిటమైడ్, బ్రాహ్మణిసైడ్ వంటి రసాయనాలు ఉంటాయి. ఇది t4 సంశ్లేషణకు సహాయపడుతుంది. T4 సంశ్లేషణ హార్మోన్ క్రియాశీల థైరాయిడ్ హార్మోన్. ఇది రక్తంలో T4 హార్మోన్ స్థాయిని పెంచుతుంది. సరస్వతి ఆకు థైరాయిడ్ సమస్యను పరిష్కరించడానికి బ్రహ్మి ట్యాబ్లెట్స్ ఎంతగానో సహాయపడతాయని డాక్టర్ ఉషానందిని అన్నారు.
ట్యాబ్లెట్స్ ఎలా తయారు చేసుకోవాలి..?
సరస్వతి ఆకులను శుభ్రం చేసుకోండి. వీటిని మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోండి. ఇది గట్టిగా ఉంటే.. కొంచం నీళ్లు యాడ్ చేయండి. దీన్ని 130 గ్రాముల అంటే వేరుశెనగ సైజులో మాత్రలుగా చేసుకోండి. వీటిని నీడలో ఆరబెట్టి.. గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీనిని సిద్ధమారుత్వములో కున్రిమణి పరిమాణం అంటారు. వీటిని నెలకోసారి తయారు చేసుకోవచ్చు.
ఈ టాబ్లెట్ వేడి నీటితో భోజనానికి ముందు రోజుకు మూడు సార్లు తీసుకోవాలి. రెగ్యులర్‌గా తీసుకుంటే రక్తంలో టీ4 హార్మోన్ స్థాయి పెరిగి హైపోథైరాయిడ్ కంట్రోల్ అవుతుంది. మీరు థైరాయిడ్ కోసం వేరే మందులు వాడుతున్నప్పటికీ.. బ్రహ్మీ మాత్రలు తీసుకుంటే.. రక్తంలో టీ 4 హార్మన్ స్థాయిలు పెరుగుతాయి. (image source – pexels)
ఈ లాభాలు ఉంటాయి..
- ఇది తెలివితేటలు, ఏకాగ్రత , జ్ఞాపకశక్తికి కారణమయ్యే మెదడులోని హిప్పోకాంపస్ భాగంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.
- ఈ ట్యాబ్లెట్స్ తీసుకోవడం వల్ల.. రక్తం శుద్ధి అవుతుంది. రక్త హీనత సమస్య కూడా దూరం అవుతుంది.
- మానసిక ఒత్తిడి, ఇతర మానసిక సమస్యలు ఉన్నవారికి ఈ ట్యాబ్లెట్స్ మేలు చేస్తాయి.
- రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడానికి సరస్వతి ఆకు అద్భుతంగా సహాయపడుతుంది.(Image source – pixabay) గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
[ad_2]
Source link
Leave a Reply