Bank Fraud: బయటపడ్డ వేల కోట్ల లోన్ కుంభకోణం.. కంపెనీపై కేసు నమోదు చేసిన సీబీఐ

[ad_1]

సీబీఐ ప్రకారం..

సీబీఐ ప్రకారం..

బ్యాంకుల నుంచి వేల కోట్లు తీసుకుని వాటిని సూట్ కేస్ కంపెనీల ద్వారా మళ్లించిన కేసొకటి సంచలనంగా మారింది. సీబీఐ వెలుగులోకి తెచ్చిన ఈ కేసులో GTL లిమిటెడ్ అనే కంపెనీ బ్యాంకుల నుంచి తీసుకున్న డబ్బును కుట్రపూరితంగా స్వాహా చేసినట్లు వెల్లడించింది. బోగస్ కంపెనీలను సృష్టించి డబ్బును మళ్లించినట్లు దర్యాప్తు సంస్థ తెలిపింది. ఈ వ్యవహారంలో కొందరు బ్యాంకర్లతో పాటు కంపెనీ డైరెక్టర్లపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొంది.

భారీ మోసం..

భారీ మోసం..

కంపెనీ మెుత్తంగా 24 మంది రుణదాతల కన్సార్టియం నుంచి లోన్స్ తీసుకుని మెుత్తంగా రూ.4,760 కోట్ల మేర మోసానికి పాల్పడినట్లు వెల్లడైంది. మెటీరియల్స్, వస్తువులు సరఫరా లేకుండానే కొన్ని కంపెనీలకు అడ్వాన్సులు ఇచ్చి సులువుగా డబ్బును పక్కదారి పట్టించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఐసీఐసీఐ బ్యాంక్ రూ.650 కోట్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.467 కోట్లు, కెనరా బ్యాంక్ రూ.412 కోట్ల మేర రుణాలను ఇచ్చి జీటీఎల్ లిమిటెడ్‌కు ఎక్స్పోజర్ కలిగి ఉన్నాయి.

కంపెనీ ఏం చేస్తుంది..

కంపెనీ ఏం చేస్తుంది..

గ్లోబల్ గ్రూప్‌కు చెందిన మనోజ్ తిరోద్కర్ 1987లో GTL ప్రారంభించారు. ఈ కంపెనీ దేశంలోనే కాక అంతర్జాతీయ మార్కెట్లలో కూడా టెలికాం ఆపరేటర్లకు నెట్‌వర్క్ విస్తరణ, కార్యకలాపాలు, నిర్వహణ సేవలను అందించే వ్యాపారాన్ని చేస్తోంది.

లోన్లతో పెట్టుబడులు..

లోన్లతో పెట్టుబడులు..

సీబీఐ దర్యాప్తులో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 2009-10 ఆర్థిక సంవత్సరం నుంచి వివిధ దఫాలుగా బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ మెుత్తాలను కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. కొంత మెుత్తాన్ని ఇతర కంపెనీ షేర్ల కొనుగోలుకు, కొంత మెుత్తాన్ని మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడుల కోసం వినియోగించినట్లు తేలింది.

RBI హెచ్చరించినప్పటికీ..

RBI హెచ్చరించినప్పటికీ..

GTL లిమిటెడ్ రుణాల విషయంలో రిజర్వు బ్యాంక్ ఏప్రిల్ 2016లోనే ఐడీబీఐ బ్యాంకును హెచ్చరించింది. సదరు కంపెనీని రెడ్ ఫ్లాగ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని సూచించింది. అయితే ఇలా చేస్తే బకాయిల వసూలు మరింత ఆలస్యం జరుగుతుందంటూ ఐడీబీఐ రిజర్వు బ్యాంకుకు బదులిచ్చింది.

ఆ తర్వాత జూలైలో మరో లేఖ ద్వారా తన ఆదేశాలు పాటించాల్సిందేనని ఆర్బీఐ తేల్చి చెప్పటంతో.. ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించడానికి NBS& కో చార్టర్డ్ అకౌంటెంట్‌ని నియమించారు.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *